Gastric Problems : వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించటానికి అనుసరించాల్సిన చిట్కాలు !

వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే కారకాలు అధిక తేమ స్థాయిలు, కలుషితమైన నీరు , ఆహారం, కారణమవుతాయి. అసిడిటీ అజీర్ణం రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినడం వల్ల చాలా మందికి వాంతులు , కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

gastric problems

Gastric Problems : వర్షాకాలంలో చర్మం, కంటి, కీళ్ల సమస్యలే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ గ్యాస్ట్రిక్ సమస్యలను దూరంగా ఉంచడం చాలా అవసరం. కాలానుగుణమైన మార్పులు పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వర్షపు రోజులలో మంచి పేగు ఆరోగ్యానికి తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన చర్యలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Positive Parenting Tips : మీ పిల్లలతో అనుబంధం పెంచే 10 సూత్రాలు

వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే కారకాలు అధిక తేమ స్థాయిలు, కలుషితమైన నీరు , ఆహారం, కారణమవుతాయి. అసిడిటీ అజీర్ణం రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినడం వల్ల చాలా మందికి వాంతులు , కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చెడిపోయిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడాల్సి వస్తుంది.

సాల్మోనెల్లా,ఇ.కోలి వంటి బ్యాక్టీరియా సోకిన పచ్చి, ఉడకని ఆహారాలు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలుగుతుంది. కలుషితమైన నీటిని సేవించటం వల్ల డయేరియా , ఇతర కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయి. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి.

READ ALSO : Health: సంతానలేమికి ఐవీఎఫ్‌.. సరైన ఫలితాలు రావాలంటే?

గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి వర్షాకాలంలో అనుసరించాల్సిన చిట్కాలు ;

1. ప్రోబయోటిక్స్ ఆహారాలు : ప్రోబయోటిక్స్ ప్రేగులకు మంచేస్తాయి. పెరుగు, మజ్జిగ తినండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి.

2. తగినంత నీరు త్రాగండి: జీర్ణక్రియకు సహాయపడటానికి , శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడానికి. రోజుకు కనీసం 101-2 గ్లాసుల నీరు తాగడం మంచిది. శరీరాన్నిహైడ్రేట్ గా ఉంచుకోవాలి.

READ ALSO : Intercropping : అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం, చీడపీడల నుండి పంటకు రక్షణ

3. పచ్చి కూరగాయలు తినవద్దు: ఆహారంగా ఉడికించిన కూరగాయలను ఎంచుకోవడం మంచిది. పచ్చి కూరగాయలు బ్యాక్టీరియా , వైరస్‌లను కలిగి ఉండవచ్చు, ఇవి పేగు ఆరోగ్యానికి అంతరాయం కలిగించడం ద్వారా కడుపు ఇన్‌ఫెక్షన్‌లకు కారకమయ్యే అవకాశం ఉంది.

4. ఆహారం నుండి రా సీఫుడ్‌ను మినహాయించండి: వర్షాకాలంలో నీరు కలుషితమవుతుంది కాబట్టి, సుషీ, సాషిమి వంటి రా సీఫుడ్‌లను తినడం వల్ల డయేరియా వస్తుంది. ఇది మాత్రమే కాదు, జంక్, ప్రాసెస్డ్ , క్యాన్డ్ ఫుడ్ తీసుకోవడం పరిమితం చేయాలి.

5. చక్కెర పదార్ధాలను తగ్గించండి: శరీరంలో మంటకు దారితీసే, జీర్ణాశయానికి ఇబ్బంది కలిగించే ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు, క్యాండీలు, స్వీట్లు మరియు డెజర్ట్‌లను తీసుకోవడం తగ్గించండి.

ట్రెండింగ్ వార్తలు