Xi Jinping : చైనా జీవితకాల అధినేతగా జిన్‌పింగ్‌..! చారిత్రక తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదం

చైనాకు జీవిత కాల అధినాయకుడిగా జీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం చ‌రిత్రాత్మ‌క తీర్మానాన్ని ఆమోదించింది.

Xi Jinping : చైనాకు జీవిత కాల అధినాయకుడిగా జీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం చ‌రిత్రాత్మ‌క తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్‌ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఆ దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ త‌న ప్ర‌తిష్ట‌ను శాశ్వ‌తం చేసుకున్నారు. క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన వందేళ్ల చ‌రిత్ర‌తో రూపొందించిన‌ డాక్యుమెంట్‌కు ఇవాళ ప్లీన‌రీలో ఆమోదం ద‌క్కింది. చైనా సాధించిన ఘ‌న విజ‌యాలు, భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌తో ఆ డాక్యుమెంట్‌ను త‌యారు చేశారు. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్‌ 8 నుంచి ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాములుగా అయితే చైనా కమ్యూనిస్టు పార్టీలోని పొలిట్‌ బ్యూరోలో రిటైర్మెంట్ వయసు 68ఏళ్లు. ప్రస్తుతం జిన్‌పింగ్‌ ఆ వయస్సుకు చేరుకున్నారు. వచ్చే ఏడాదితో ఆయన పదవీకాలం రెండు పర్యాయాలు ముగుస్తుంది.

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

దేశాధ్య‌క్ష ప‌ద‌వికి రెండుసార్లకు మించి పదవిలో ఉండకూడదని, 68 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్‌ అవ్వాల్సిందేనని మావో జెడాంగ్‌ తర్వాత అధికారంలోకి వచ్చిన డెండ్‌ జియవోపింగ్‌ నిర్దేశించారు. ఈ నిబంధనను మారుస్తూ జిన్‌పింగ్‌ సర్కార్‌ మూడేళ్ల కిందట రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణతో ఇప్పుడు పొలిట్‌ బ్యూరోలో ఆమోదం లభించడంతో జిన్‌పింగ్‌కు మూడోసారి అధికారం చేపట్టేందుకు వీలు కలిగింది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా తన వందేళ్ల చరిత్రలో చేసిన మూడో చారిత్రక తీర్మానం ఇది. 1945లో మావో జిదాంగ్ అధికారాలను బలోపేతం చేసేందుకు, 1981లో డెంగ్‌ జియావోపింగ్‌ సమయంలో ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచేందుకు సీపీసీ ఈ తీర్మానాలను ఆమోదించింది. తాజా తీర్మానంతో మావో, డెంగ్‌లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా జీ జిన్‌పింగ్‌కు అవకాశం లభించినట్లయింది.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

క‌మ్యూనిస్టు దిగ్గ‌జాల‌తో స‌మానంగా ఇప్పుడు జిన్‌పింగ్‌ను చైనీయులు చూడ‌నున్నారు. తాజా తీర్మానంతో గ‌తంలో కొంద‌రు చైనా నేత‌లు జారీ చేసిన అధికార వికేంద్రీక‌ర‌ణ ఆదేశాల‌ను జిన్‌పింగ్ ర‌ద్దు చేసిన‌ట్లు కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. నాలుగు రోజుల పాటు జ‌రిగిన ప్లీన‌రీలో దేశానికి చెందిన టాప్ నేత‌లంతా ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన భారీ మీటింగ్ ఇది. రాబోయే ఎన్నిక‌ల్లో మూడ‌వ సారి దేశాధ్య‌క్ష ప‌ద‌వి కోసం జిన్‌పింగ్ పోటీప‌డ‌నున్నారు.

1945లో మావో త‌న తీర్మానంతో పూర్తి ఆధిపత్యాన్ని పొందారు. ఆ త‌ర్వాత ఆ అధికారంతో ఆయ‌న 1949లో పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనాను క్రియేట్ చేశారు. ఇక 1978లో డెంగ్ త‌న తీర్మానం ద్వారా మావో త‌ప్పుల‌ను ఎత్తిచూశారు. 1966 నుంచి 1976 వ‌ర‌కు జ‌రిగిన సంస్కృతి విప్ల‌వంలో ల‌క్ష‌లాది మంది మృతిచెందార‌ని, దానికి మావో కార‌ణ‌మ‌ని డెంగ్ ఆరోపించారు. ఆ త‌ర్వాత దేశంలో బ‌ల‌మైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు డెంగ్ పునాది వేశారు. అయితే ఆ ఇద్ద‌రికీ భిన్నంగా జిన్‌పింగ్ త‌న తీర్మానం ప్ర‌తిపాదించారు. తాజా తీర్మానం ద్వారా త‌న అధికారాన్ని జిన్‌పింగ్ మ‌రింత కాలం పొడిగించాల‌నుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ప్రస్తుతం చైనాలో శక్తిమంతమైన నేతగా జిన్ పింగ్ ఉన్నారు. ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) అధ్యక్షుడిగానే కాకుండా శక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్ గా.. చైనా అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటికే జిన్ పింగ్ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. రెండోసారి అధ్యక్షుడిగా వచ్చే ఏడాది ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈలోపే మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. మూడో సారే కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండేలా పావులు కదుపుతున్నారు.

రెండుసార్ల కన్నా ఎక్కువగా పదవీ బాధ్యతలు చేపట్టేలా చైనా రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారు. దీంతో అధ్యక్ష పదవి శాశ్వతంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గత చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ తర్వాత శక్తిమంతమైన నేతగా జిన్ పింగ్ మారారు. జిన్‌పింగ్‌కు 2016లో కమ్యూనిస్టు పార్టీలో ‘అత్యంత కీలకమైన నాయకుడు’ హోదా లభించింది. జిన్ పింగ్ హయాంలోనే చైనా ప్రపంచ శక్తిగా మారుతుందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు