Pokhara Airport: రన్‌ వేపై కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్‌బాక్స్ లభ్యం

Pokhara Airport: నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచి పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే.

దీంతో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇవాళ బ్లాక్‌బాక్స్ గుర్తించామని కాఠ్మాండూ విమానాశ్రయ అధికారి షేర్ బహదూర్ ఠాకూర్ చెప్పారు.

విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్లాక్‌బాక్స్ ప్రత్యేక ఆల్గారిథం ద్వారా రికార్డు చేస్తుంది. కాగా, నేటి తమ రెగ్యులర్ విమాన సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యతి విమానయాన సంస్థ పేర్కొంది. కాగా, విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.

Nepal Plane Crash Incident : నేపాల్ విమాన ప్ర‌మాద ఘటన.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ భార‌త ప్ర‌యాణికుడు

ట్రెండింగ్ వార్తలు