China Corona Fears : వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్లకు భారీగా పెరిగిన డిమాండ్.. చైనాలో కరోనా టెర్రర్

చైనాలో మరో కలకలం రేగింది. పెరుగుతున్న కరోనా కేసులతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

China Corona Fears : కరోనావైరస్ పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో.. మరోసారి కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన కరోనా ఆంక్షల పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో జీరో కొవిడ్ పాలసీ విషయంలో చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. ఇదే సమయంలో లాక్ డౌన్లను ఎత్తేస్తే కొవిడ్ కేసులు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతాయని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Also Read : China: చైనాలో కోవిడ్ నిబంధనల పేరుతో ఇంట్లోనే ఉంచి తాళం వేసిన అధికారులు.. అగ్ని ప్రమాదంలో ఆహుతైన కుటుంబం

తాజాగా చైనాలో మరో కలకలం రేగింది. పెరుగుతున్న కరోనా కేసులతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చైనాలో కేవలం నగరాల్లోనే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అరకొర సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. దీంతో, అక్కడి పౌరులు ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు ఓ పత్రిక తెలిపింది.

Also Read : China COVID: చైనా ఒకవేళ జీరో కొవిడ్ పాలసీని ఎత్తేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

చైనాలో కరోనా ఉధృతి కలవరానికి గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 40 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. దీంతో ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై బాష్పవాయుగోళాలను, పెప్పర్ స్ప్రేలను ప్రయోగిస్తున్నారు. మొత్తంగా కరోనా దెబ్బకు మరోసారి చైనాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు