Rs.1000 Chole Bhature : ఒక్క ప్లేట్‌ ‘చోలె భ‌టురే’ ధర‌ రూ.1000…

ఒక్క ప్లేట్‌ ‘చోలె భ‌టురే’ ధర‌ రూ.1000. Rs.50 లేదా రూ.100 ధర ఉండే ఈ రెసిపీ ఏకంగా రూ.1000లు చెల్లించి తిన్నాక దాని టేస్ట్ ఎలా ఉందంటే..

One plate Chole Bhature Rs.1000 : ఒక్క ప్లేట్ చోలె భ‌టురే ధర అక్షరాలా రూ.1000. చోలే భటురే నార్త్ ఇండియా టేస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా చోలె భ‌టురే దొరికినా..అసలైన టేస్ట్ నార్త్ ఇండియాలోనే ఉంటుందంటారు ఈ చోటో భటురే ప్రియులు. నార్త్ లో దొరికే చోలె భ‌టురే ఒక్కసారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాలనిపించేత టేస్ట్ ఉంటుందంటారు. అటువంటి చోలే భటురే నార్త్ ఒక ప్లేట్ లో రూ.50 లేదా మహా అయితే రూ.100 ఉంటుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే రూ.150 ఉంటుందేమో.

కానీ ఒక్క ప్లేట్ చోలే భటురే రూ.1000లు అంటే నమ్ముతారా? నమ్మాలని అనిపించకపోయినా ఇది నిజం. ఎందుకంత రేటు అంటే..కొన్ని వంటలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ది చెందుతాయి. అవే వంటలు వేరే ప్రాంతంలో తినాలంటే కాస్త రేటు పెట్టాల్సిందే. అంతరేటు పెట్టినా..స్థానికంగా ప్రసిద్ది చెందినంత టేస్టు మాత్రం ఉండకపోవచ్చు. అదే జరిగింది ఈ ప్లేటు రూ. 1000ల చోలే భటురే టేస్టు విషయంలో. ఇంతకీ ఇంత రేటు చోలే భటురే ఎక్కడంటే స్వీడన్ లో . మన నార్త్ ఇండియాలో ఒక్క ప్లేట్ తింటే మరో ప్లేట్ లాగించాలనిపించేంత రుచిలో కట్టి పడేసే ఈ చోలే భటురే స్వీడన్ లో మాత్రం ప్లేట్ రూ.1000లకు అమ్ముతున్నారు.

Read more :  ‘లవ్ బ్రేకప్’ టీ షాప్..భగ్నప్రేమికుడి చాయ్..ప్రేమ గురించి సూక్తులు..

ఇండియాకు చెందిన ఓ వ్య‌క్తి స్వీడ‌న్‌లో ఉంటున్నాడు. అతనికి చోలే భటురే అంటే చాలా ఇష్టం. అది స్వీడన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ లో దొరుకుతోందని తెలిసి.. ఓ ఇండియ‌న్ ఆర్డ‌ర్ చేశాడు. తీరా వచ్చాక దాన్ని చూసి షాక్ అయ్యాడు. ఎంతో ఆశగా తిందామనుకున్న సదరు వ్యక్తికి తినాలనే ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. ఎందుకంటే అది చూడ‌టానికి చోలె భ‌టురేలాగానే అస్సలు లేదు.

కానీ తీరా ఆర్డ్ ఇచ్చాడుగా ఎలా ఉన్నా తినాల్సిందేననుకున్నాడు. టేస్ట్ చేశాడు. ఛీ అనుకున్నాడు. బయటకు ఊసేయాలనేంత ద‌రిద్రంగా ఉంది దాని టేస్ట్. ఎలాగోలా తిని బిల్లు ఎంతైంది అని అడిగాడు.దానికి సదరు వ్యక్తి స్వీడన్ కరెన్సీలో 160 స్వెడిష్ క్రోన్స్ అని చెప్పాడు. అదే మన కరెన్సీలో రూ.1000ల కంటే ఎక్కువే.

Read more : Rs.1000 tea : చాయ్ రూ.1000..మన హైదరాబాద్ లోనే

అది తిన్నాక సదరు వ్యక్తి ‘చోలె భ‌టురే’ అంటే ఆ స్పైసీనెస్ వేరు. చోలెలో వేసే మ‌సాలాతోనే ఆ టేస్ట్ వ‌స్తుంది. కానీ.. ఈ చోలెలో మాత్రం ఉప్పు, పెప్ప‌ర్ తప్ప ఇంకేం లేదు. అయినా.. చోలెలో ఎవ‌రైనా దానిమ్మ గింజ‌లు వేస్తారా. మ‌రోవైపు భ‌టురే చుస్తే మందంగా ఉంది.. తియ్య‌గా ఉంది.. అంటూ త‌న బాధ‌ను వెళ్లగ్రక్కాడు ఆ వ్యక్తి..

 

ట్రెండింగ్ వార్తలు