Imran Khan: మోదీపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్‌ను, పాక్ నాయకత్వాన్ని భారత్‌తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్‭ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరొక వైపు భారత్‭పై ఇమ్రాన్ తరుచూ పొగడ్తలు కురిపించడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా మోదీనే మళ్లీ ప్రధాని కావాలని ఇమ్రాన్ వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. అవినీతి విషయంలో ఈ పొగడ్తలు రావడం విశేషం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‭పై వివర్శల సదర్భంగా ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఇమ్రాన్ ప్రసంగించారు.

ఒక దేశ ప్రధాని విదేశాల్లో ఇంత పెద్ద మొత్తం అక్రమాస్తులు కూడబెట్టడం పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కే చెల్లుతుందని ఇమ్రాన్ దుయ్యబట్టారు. ఆయన ఎంత కూడబెట్టారో ఎవ్వరూ అంచనావేయలేరని అన్నారు. అదే సమయంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించారు. మోదీకి విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నాయో ఎవరైనా చెప్పగలరా అని ప్రజలను ప్రశ్నించారు. తద్వారా మోదీ అవినీతికి దూరమని అంటూనే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతిలో కూరుకుపోయారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్‭ను కలిసిన ముస్లిం నేతలపై మండిపడ్డ ఓవైసీ

పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్‌ను, పాక్ నాయకత్వాన్ని భారత్‌తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్‭ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరొక వైపు భారత్‭పై ఇమ్రాన్ తరుచూ పొగడ్తలు కురిపించడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా మోదీనే మళ్లీ ప్రధాని కావాలని ఇమ్రాన్ వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది.

ఇక ఇమ్రాన్ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఆస్తుల గురించి మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ వివరాలు ఒకసారి చూసుకున్నట్లైతే.. ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం మోదీ ఆస్తుల విలువ 2022 మార్చి 31 నాటికి 2,23,82,504 రూపాయలు. మార్చి 31, 2021 నాటికి ఆయనకు గల స్థిరాస్తుల విలువ 1.1 కోట్లు రూపాయలు. దీంట్లో నాలుగో వంతు ఉన్న తన వాటాను విరాళంగా ఇచ్చేశారు. మోదీ చరాస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 26.13 లక్షల రూపాయలు పెరిగింది. 2022 మార్చి 31నాటికి ఆయన వద్ద నగదు రూపంలో 35,250 రూపాయలు ఉంది. ఆయనకు 9,05,105 రూపాయల విలువైన పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, 1,89,305 రూపాయల విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి.

Congress President Election: కాంగ్రెస్ పార్టీలో నయా కుమ్ములాటలు.. కొత్త గ్రూపులకు తెరలేపుతోన్న అధ్యక్ష ఎన్నిక

ట్రెండింగ్ వార్తలు