Unique Blood Group : ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి భారత్‌లో గుర్తింపు..

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది. అటువంటి రక్తపు గ్రూపును కలిగిన పదవ వ్యక్తిగా 65 ఏళ్ల గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు.

Unique Blood Group ‘EMM’ negative Gujarat man :  ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది. అటువంటి రక్తపు గ్రూపును కలిగిన పదవ వ్యక్తిగా 65 ఏళ్ల గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు.అసలు ఆ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకత ఏంటి..? అది ఎలా పనిచేస్తోందో తెలుసుకుందాం.

సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే ఈఎంఎం నెగిటివ్ ఎంతో ప్రత్యేకమైనది. మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, ఓ, ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ..ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని నిపుణులు తెలిపారు.అయితే..గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య. దీనికి సంబంధించిన సర్జరీ కోసం చేసిన రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బయట పడిందని డాక్టర్లు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ EMM నెగిటివ్ అని నామకరణం చేసింది.

మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. ఐతే మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు ( Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయి.

ఇవేవీ కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంది. అది చాలా అరుదుగా ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి దీని గురించి తెలియదు. అదే EMM Blood Group. ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిలో ‘EMM నెగిటివ్’ రక్తపు గ్రూపును నిపుణులు గుర్తంచారు.ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలో కేవలం పదే పదిమందకి ఉంది.అటువంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్ లోని రాజ్ కోట్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది. అయితే సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే EMM నెగిటివ్ చాలా ప్రత్యేకమైనది.

మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, ఓ, ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ, ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని నిపుణులు తెలిపారు.

అయితే గుజరాత్‌కు చెందిన ఈ 65 ఏళ్ల వ్యక్తికి గుండె సమస్య ఉంది. అతను సూరత్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. సూరత్‌లోని సమర్పన్ బ్లడ్ డొనేషన్ సెంటర్ వైద్యుడు సన్ముఖ్ జోషి తెలిపారు. దీని కోసం డాక్టర్లు రక్త పరీక్షలు చేయగా ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నట్లుగా బయట పడిందని వైద్యులు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ EMM నెగిటివ్ అని నామకరణం చేసింది.

అయితే..అహ్మదాబాద్‌లోని ప్రథమ ల్యాబొరేటరీలో అతని రక్తం రకం కనుగొనబడకపోవడంతో, నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు.పరీక్ష తర్వాత, నమూనా ఏ సమూహంతోనూ సరిపోలలేదు. దీని తరువాత వృద్ధుడితో పాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపారు. ఆ తర్వాత ఇది EMM Blood Group అని తేలింది.

 

 

ట్రెండింగ్ వార్తలు