RSS-Israel Consul General: భారత దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది: ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ సంచలన వ్యాఖ్య

"భారత దేశ నిర్మాణంలో రాష్ట్రియ స్వయంసేవక్ సంఘ్(RSS) కీలక పాత్ర పోషిస్తుంది". ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

RSS – Israel Consul General: “భారత దేశ నిర్మాణంలో రాష్ట్రియ స్వయంసేవక్ సంఘ్(RSS) కీలక పాత్ర పోషిస్తుంది”. ఈ వ్యాఖ్యలు చేసింది ఈ హిందుత్వ వాదో, ఆర్ఎస్ఎస్ నేతలో కాదు..సాక్షాత్తు ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఇటీవల “organiser” అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోషాని ఈవ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. “Organiser” పత్రిక సంఘ్ ఆధ్వర్యంలో ప్రచురించబడుతున్న ఆంగ్ల మాధ్యమ పత్రిక కావడం గమనార్హం. మనుషుల శాంతియుత జీవనంపై దృఢ విశ్వాసం ఉన్నదని నమ్మే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం తనను ఎంతో ఆకట్టుకున్నదని శోషానీ అన్నారు. భారత్ – ఇజ్రాయెల్ మధ్య సాంప్రదాయ బంధాలు, సారూప్యతలు, దౌత్య పరమైన సంబంధాలు పెనవేసుకుని ఉన్నాయని శోషానీ అన్నారు. ప్రత్యేకించి దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న పాత్ర పట్ల గొప్ప ఆసక్తి కనబర్చుతున్నట్లు కొబ్బి శోషానీ “ఆర్గనైజర్” పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Also read:Forbes India Billionaires List 2022 : ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ అగ్రస్థానం, రెండో స్థానంలో అదానీ..!

ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే అయినప్పటికీ భారత్ – ఇజ్రాయెల్ మధ్య ఇదే తరహా సారూప్యత ఉన్నట్లు ఆయన అన్నారు. ఇదే కాదు గతంలోనూ..పలుమార్లు భారత్ కు వచ్చిన కొబ్బి శోషానీ..ఇక్కడి ప్రజల జీవన విధాన్నాన్ని..హిందుత్వంపై ప్రజల విశ్వాసాన్ని కొనియాడారు. గతేడాది విజయదశమి సందర్భంగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానీని ఆహ్వానించారు. ఆనాటి ఈ పర్యటనపై కొబ్బి శోషానీ మాట్లాడుతూ..గతంలో ఆర్ఎస్ఎస్ గురించి తాను చాలా విన్నానని..సంఘ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమాలను స్వయంగా పరిసలించే అవకాశం ఎదురు చూశానని..అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఆహ్వానం మేరకు నాగపూర్ వచ్చినట్లు” కొబ్బి శోషానీ తెలిపారు. అయితే విజయదశమి కార్యక్రమం అనంతరం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అర్ధం చేసుకున్న తాను..భారత దేశ నిర్మాణంలో ఆ సంస్థ పాత్ర ఏమిటో అర్ధం చేసుకున్నానని కొబ్బి శోషానీ చెప్పుకొచ్చారు.

Also read:Kuwait Government: పాకిస్తాన్ బాటలోనే కువైట్: రాజకీయ అస్థిరత కారణంగా ప్రధాని సహా మంత్రులు రాజీనామా

ట్రెండింగ్ వార్తలు