Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?

జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకంగా, అత్యంత ప్రాణాంతక వేరియంట్ గా పరివర్తనం చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు అమెరికా చెందిన ప్రజ ఆరోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు.

Omicron transmission : కరోనా వైరస్ వ్యాప్తి జంతువుల ద్వారా కూడా జరుగుతుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ప్రాణాంతక వేరియంట్లకు జంతువులు నిలయంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. కొత్త వేరియంట్లకు జంతువులు రిజర్వాయర్లుగా పనిచేస్తుంటాయని పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతిలో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా పెరిగేందుకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమైంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో ఉత్పరివర్తనాల వల్ల పుట్టుకొచ్చింది కాదేమోనని అభిప్రాయపడ్డారు.

జంతవుల నుంచే ( బహుశా ఎలుకల వంటి వాటి నుంచి) మనుషుల్లోకి వైరస్ ప్రవేశించి ఉంటుందని అంచనా వేశారు. జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకంగా, అత్యంత ప్రాణాంతక వేరియంట్ గా పరివర్తనం చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు అమెరికా చెందిన ప్రజ ఆరోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు.

Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

భారతో లో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. బీహార్ లో క‌రోనా కొత్త స‌బ్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లో బీఏ.12 వేరియంట్ బ‌య‌ట‌ప‌డినట్లు తెలిపారు. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్రమాద‌క‌ర‌మ‌ని హెచ్చరించారు. ఢిల్లీలోనూ ఈ స‌బ్‌ వేరియంట్‌కు చెందిన మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశామని మైక్రోబ‌యాల‌జీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి వెల్ల‌డించారు. 13 శాంపిళ్ల‌ను ప‌రీక్షించామని తెలిపారు. అందులో ఒక‌టి బీఏ.12 స‌బ్ వేరియంట్‌గా గుర్తించామని, మిగ‌తా 12 శాంపిళ్లు బీఏ.2 స‌బ్ వేరియంట్‌ అని ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి పేర్కొన్నారు. ఇది బీఏ.2కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిపారు. అయినా, ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ స‌బ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.

Shigella Infection : కేరళలో మళ్లీ షిగెల్లా విజృంభణ.. లక్షణాలు ఇవే!

భారత్ లో కరోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది. ఢిల్లీలో ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య భయపెడుతోంది. 46 రోజుల తర్వాత తొలిసారి 3 వేల మార్క్‌ను దాటాయి. అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య 17వేలకు చేరువైంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 14 వందల 90 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

పాజిటివిటీ రేటు 4.5శాతం దాటింది. చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలలో జ్వరం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు లాంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు అంటున్నారు. కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

మరోవైపు కేరళలో మరోసారి షిగెల్లా కలకలం సృష్టించింది. కోజికోడ్‌ పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. బాలిక పొరుగింట్లో ఉన్న మరో చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు.

పిల్లలిద్దరికీ పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రమైతే మరణం సంభవిస్తుందని, అందుకే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు