Russia-Ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగిస్తామంటున్న పుతిన్..! షరతులు వర్తిస్తాయంటున్న యుక్రెయిన్..!!

యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే యోచనలో పుతిన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. కానీ యుక్రెయిన్ ఒప్పుకోవట్లేదట..యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పలు షరతులు పెడుతున్నారు. ఆ షరతులు ఏమిటంటే..

Russia-Ukraine war : రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలై 10నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధకాండ కొనసాగుతూనే ఉంది. ఇది రెండు దేశాల ‘ఇగో’లకు సంబంధించినదా? కాదా అనేది పక్కన పెడితే నష్టం అనేది రెండు దేశాలకు ఉంది. ఎక్కువగా నష్టపోయింది యుక్రెయిన్ అని చెప్పుకోకతప్పదు. రష్యా ఆయుధాల పరంగా..సైన్యంపరంగానే కాకుండా పలు దేశాలు యుక్రెయిన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా వాణిజ్యపరంగా కూడా నష్టలను చవిచూస్తోంది. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే ఆ దేశం దాదాపు శ్మశానాన్ని తలపిస్తోంది. నిర్మాణపరంగా నేలమట్టం అయిపోయింది. ఇక ఆర్థిక నష్టాల గురించి చెప్పనే అక్కరలేదు. ఇలా ఇరు దేశాలు నష్టపోతున్నా ఈ యుద్ధం మాత్రం కొనసాగుతోంది. యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలను ఇప్పటికే పుతన్ కు పలు దేశాలు సూచించాయి. హెచ్చరించాయి కూడా. అయినా పుతిన్ మాత్రం యుక్రెయిన్ నాటోలో చేరను అని స్పష్టంచేసేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. దీనికి యుక్రెయిన్ కూడా సిద్దపడలేదు. అమెరికా వంటి దేశాలు అందించే ఆయుధ సాయంతో తన శక్తికి మించి పోరాడుతునే ఉంది. యుద్ధం ఆపటానికి ఒకటి రెండు సార్లు ఇరు దేశాలు చర్చలు జరిపినా యుద్ధం ఆగని పరిస్థితి. అలా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో యుక్రెయిన్ పై యుద్దాన్ని ఆపేయాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. మధ్య 10నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం వల్ల ఇరు దేశఆలకు భారీ నష్టం జరుగుతోంది. ఈ యుద్ధం విషయంలో రష్యాను ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తోంది. నిజం చెప్పాలంటే రష్యాలో కూడా వ్యతిరేకత ఉంది. అయినా పుతిన్ మాత్రం యుక్రెయిన్ ఓటమి అంగీకరించాలి లేదా ప్రపంచ వినాశం (అణుబాంబు దాడితో) అయినా జరగాలని చెప్పారు ఒకానొక పరిస్థితిలో. ఈక్రమంలో పుతిన్ యుద్ధాన్ని ఆపేవేయాలనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

తాజాగా పుతిన్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నామని.. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పానని పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ పేర్కొన్నారు. యుద్ధం ఆపటానికి తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా యుక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని రష్యా చెబుతోంది. ఈ విషయంలో యుక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే ముందు దాడులు చేయటం నిలిపివేయాలని స్పష్టంచేసింది. అలాగే తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగించాలని అప్పుడు చర్చల గురించి ఆలోచిస్తామని యుక్రెయిన్ చెబుతోంది.

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనికి జెలెన్ స్కీ చాలా సంతోషం వ్యక్తంచేశారు. నిజంగా అన్ని దేశాల కంటే అమెరికానే యుక్రెయిన్ కు యుద్ధం విషయంలో ఎక్కువ సహాయం అందించింది. ఆయుధ పరంగానే మోరల్ సపోర్ట్ విషయంలో కూడా. జో బైడెన్ జెలెన్ స్కీకి ఈ స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాత రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా మరి అమెరికా యుక్రెయిన్ కు స్పష్టమైన హామీ వల్లనే పుతిన ఈ నిర్ణయం తీసుకుని ఉండరని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు దేశాల యుద్ధం వల్ల ఈ ఇరుదేశాలకే కాకుండా ఈ ప్రభావం పలు దేశాలపై పడిందనే విషయం కూడా వాస్తవమే.

 

 

ట్రెండింగ్ వార్తలు