World’s Best Airports : ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలివే.. అగ్రస్థానంలో హమ‌ద్, సింగపూర్‌ చాంగికి రెండో స్థానం!

World's Best Airports : ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో హమద్ ఇంటర్నేషనల్ టాప్ ర్యాంకులో నిలిచింది. సింగపూర్ చాంగి రెండో స్థానానికి దిగజారింది.

World’s Best Airports : ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో దోహాకు చెందిన హమద్ ఇంటర్నేషనల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో సింగపూర్‌కు చెందిన చాంగి నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2024 జాబితాలో 12 సార్లు విజేత అయిన సింగపూర్ ఈ సంవత్సరం టైటిల్ చేజార్చుకుంది. దాంతో రెండో స్థానంలో ఉన్న చాంగి టాప్ ప్లేసులోకి దూసుకొచ్చింది.

టాప్ ర్యాంకులో చోటు దక్కని అమెరికా ఎయిర్‌పోర్టులు :
ఆసియాలో సియోల్ ఇంచియాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2024లో అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయంగా కూడా దీనికి పేరు ఉంది. అయితే, టోక్యోలోని హనేడా, నరిటా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. హాంకాంగ్ విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించింది.

ఈ నగరం కోవిడ్ -19 తర్వాత ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో 22 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకుంది. మరోసారి అమెరికా విమానాశ్రయాలు అగ్రస్థానంలో ఎక్కడా కనిపించలేదు. అత్యధిక ర్యాంక్, సీటెల్-టాకోమా, 6 స్థానాలు దిగజారి 24కి పడిపోయింది. ఐరోపాలో పారిస్ చార్లెస్ డి గల్లె, మ్యూనిచ్, జ్యూరిచ్, ఇస్తాంబుల్‌లు టాప్ 10 స్థానాల్లో నిలిచాయి.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

న్యూయార్క్ జేఎఫ్‌కే 5 స్థానాలు పడిపోయి 93వ స్థానానికి చేరుకుంది. లాగార్డియా 57 నుంచి 33కి పెరిగింది. మెల్‌బోర్న్ అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియన్ విమానాశ్రయం 19వ స్థానంలో స్థిరంగా కొనసాగుతుంది. లండన్ హీత్రూ ఒక స్థానం ఎగబాకి 21వ ర్యాంక్‌కి చేరుకోగా, గాట్విక్ 7 స్థానాలు ఎగబాకి 48కి చేరుకుంది.

జపాన్‌కు చెందిన ఒకినావా 199వ స్థానం నుంచి 91వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాదిలో హెచ్ఐఏ 10వ ఏటా మైలురాయిని చేరుకుంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు కస్టమర్లు ఇచ్చిన అభిప్రాయాల ద్వారా వెల్లడించింది. గత ఏడాదిలో ర్యాంకింగ్‌లతో పాటు 2024లో ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • దోహా హమద్ (2)
  • సింగపూర్ చాంగి (1)
  • సియోల్ ఇంచియాన్ (4)
  • టోక్యో హనెడా (3)
  • టోక్యో నరిటా (9)
  • పారిస్ CDG (5)
  • దుబాయ్ (17)
  • మ్యూనిచ్ (7)
  • జ్యూరిచ్ (8)
  • ఇస్తాంబుల్ (6)
  • హాంకాంగ్ (33)
  • రోమ్ ఫియుమిసినో (13)
  • వియన్నా (11)
  • హెల్సింకి-వాంటా (12)
  • మాడ్రిడ్-బరాజాస్ (10)
  • సెంట్రైర్ నగోయా (16)
  • వాంకోవర్ (20)
  • కన్సాయ్ (15)
  • మెల్బోర్న్ (19)
  • కోపెన్‌హాగన్ (14)

Read Also : Infinix Note 40 Pro 5G First Sale : ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు