Russia – Ukraine war: మే 1 నాటికి తిరిగి రాకపోతే పదేళ్ళపాటు నిషేధం: విదేశీ కంపెనీలకు రష్యా హెచ్చరిక

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా తమ దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ సంస్థలకు రష్యా ప్రభుత్వం హెచ్చరికలు చేసింది

Russia – Ukraine war: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా తమ దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ సంస్థలకు రష్యా ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. కార్యకలాపాలు నిలిపివేసిన విదేశీ సంస్థలు 2022 మే 1 నాటికి తిరిగి పనులు ప్రారంభించని పక్షంలో ఆయా సంస్థలపై దేశంలో కార్యకలాపాలు సాగించకుండా పదేళ్ళపాటు నిషేధం విధిస్తామని రష్యాలోని డుమా రాష్ట్ర డిప్యూటీ మినిస్టర్ ఎవ్జెనీ ఫెడోరోవ్ హెచ్చరించారు. ఈమేరకు దేశ ఆర్ధిక మంత్రికి ఒక లేఖ కూడా రాశాడు ఫెడోరోవ్. అనేక విదేశీ కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాలను నిలిపివేసాయి, దీంతో రష్యన్లు ఉద్యోగాలు కోల్పోయారు, ఆ సంస్థలు తిరిగి ఎపుడు కార్యాలయాలు తెరుస్తాయో తెలియక ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. విదేశీ పెట్టుబడులు సైతం నిలిచిపోయాయి.

Also Read :India – Taliban: భద్రత కల్పిస్తాం.. రాయబార కార్యాలయం తెరవండి: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

ఈ వ్యవహారంపై డుమా రాష్ట్ర డిప్యూటీ మినిస్టర్ ఎవ్జెనీ ఫెడోరోవ్ స్పందిస్తూ..యుద్ధాన్ని కారణంగా చూపుతూ..విదేశీ సంస్థలు రష్యా నుంచ్చి వెళ్లిపోయాయి. మే 1, 2022 వరకు కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరించాలి, కానీ పక్షంలో ఆయా సంస్థల వాణిజ్య కార్యకలాపాలపై రష్యాలో 10 సంవత్సరాల పాటు నిషేధం విధించాలనని ఫెడోరోవ్ ప్రతిపాదించాడు. రష్యాను విడిచి వెళ్లిన సంస్థల నిర్వహణ భాద్యతను.. దేశంలోని ఇతర సంస్థలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించేలా కొందరు నేతలు చేసిన ప్రతిపాదనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. అయితే ఆభాద్యతను ప్రభుత్వం తీసుకోవడం కంటే..తాత్కాలిక పరిపాలన విభాగానికి అప్పగించడం మేలని నిపుణులు సలహా ఇచ్చారు.

Also read: America : చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్.. ‘రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు’

ట్రెండింగ్ వార్తలు