Russians Fight For Sugar : రష్యాలో దారుణ పరిస్థితులు.. చక్కెర కోసం ఎగబడ్డ జనాలు

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై దండెత్తిన రష్యాలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి. రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Russians Fight For Sugar : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై దండెత్తిన రష్యాలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి. రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల నిత్యావసరాల కోసం పాట్లు పడుతున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు రష్యాలోని అన్ని రంగాలపైనా పడింది. కొన్నిచోట్ల నిత్యావసరాలకు సైతం కటకట ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం.

ఓ సూపర్ మార్కెట్ లో కొందరు రష్యన్లు చక్కెర కోసం ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. చక్కెర కోసం మీద పడి కొట్టుకున్నంత పని కూడా చేశారు. చివరికి వృద్ధులు కూడా తోపులాటకు దిగారు.(Russians Fight For Sugar)

Biological Weapons On Ukriane : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ద్రవ్యోల్బణం కారణంగా రష్యాలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొరత కారణంగా చక్కెర అమ్మకాలపై దుకాణదారులు పరిమితి విధించారు. ఒకరికి 10 కేజీల చక్కెర మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. దాంతో, ఓ సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని చక్కెర ప్యాకెట్ల కోసం జనాలు ఎగబడ్డారు.

దీనిపై రష్యా అధికారులు స్పందించారు. దేశంలో పంచదారకు కొరతే లేదన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. చక్కెర దొరకదేమోనన్న కంగారుతో దుకాణాలపై ఎగబడుతున్నారని, అందువల్లే కొన్నిచోట్ల ధరలు పెరిగాయని, కొన్నిచోట్ల చక్కెర దొరకని కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.

గత 27 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల
వర్షం కురిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్.

Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం
జరుగుతోంది. భారీ సంఖ్యలో రష్యా తన సైనికులను కోల్పోతోంది.

రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటించి శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు యుక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 15వేల 300 మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు తెలిపింది. అలాగే 99 యుద్ధ విమానాలు, 123 హెలికాప్టర్లతో పాటు 509 యుద్ధ ట్యాంకులు, 1556 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు యుక్రెయిన్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.

మరోవైపు రష్యా సేనలు దాడుల్లో తీవ్రతను పెంచాయి. యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై బాంబులు, క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మరియుపోల్‌, కీవ్‌, ఖార్కివ్‌ నగరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. మరియుపోల్‌ స్వాధీనానికి రష్యా సేనలు ముమ్మరంగా
ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టాయి. మరియుపోల్‌లో ప్రతి పది నిమిషాలకు బాంబు దాడులు చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు