Whatsapp Emoji : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ ఎమోజీ పంపితే రూ.20లక్షలు ఫైన్, జైలు

వాట్సాప్ యూజర్లు ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇష్టానుసారంగా ఎమోజీలు వాడటానికి వీల్లేదు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

Whatsapp Emoji : వాట్సాప్ లో మనకు రకరకాల ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా ఎమోజీలు వాడుతుంటాం. మనం చెప్పాలనుకున్న విషయాన్ని మాటల్లో కాకుండా సింపుల్ గా ఓ ఎమోజీతో మన ఫీలింగ్ ని అవతలి వారికి ఎక్స్ ప్రెస్ చేస్తాం. అయితే, ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇష్టానుసారంగా ఎమోజీలు వాడటానికి వీల్లేదు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

Whatsapp Emoji

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీ విషయంలో. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. రూ.20లక్షలు ఫైన్ వేయడమే కాదు జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే, ఈ రూల్ మన దేశంలో కాదులెండి. సౌదీ అరేబియాలో.

Whatsapp

WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

అవును.. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో.. ఈ తరహా రూల్ తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఆ దేశ పౌరులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే వారికి మూడినట్టే. దీన్ని వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. ఆ వ్యక్తికి రూ.20లక్షలు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. వాస్తవానికి సౌదీ అరేబియాలో తెలియని వాళ్లతో చాట్ చేయడానికి ప్రయత్నించడం కూడా నేరం కిందకు వస్తుంది.

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అతి త్వరలో వాట్సాప్ వెబ్‌లోనూ కాలింగ్ ఫీచర్ రానుంది. ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్లు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ వాట్సాప్ వెబ్ యూజర్ల అందరికీ అందుబాటులో ఉండదు. ఎంపిక చేసిన కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.

అక్టోబర్ 2020లోనే మెసేజింగ్ యాప్.. WhatsApp Web, డెస్క్‌టాప్ యూజర్ల కోసం వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లతో పాటు కొన్ని నాన్-బీటా టెస్టర్‌లకు కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ త్వరలో ఎక్కువ మంది యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ట్రెండింగ్ వార్తలు