Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో మృత్యుంజయుడు.. 94 గంటలు మూత్రం తాగి బతికాడు

అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్(17) అనే బాలుడు 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, 94 గంటల పాటు తాను నరకయాతను అనుభవించానని ఆ కుర్రాడు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రం తాగి బతికానని తెలిపాడు.

Turkey Earthquake : భారీ భూకంపం టర్కీలో విధ్వంసం సృష్టించింది. వేలాది మంది చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో భవనాలన్నీ కూలిపోయాయి. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్స్ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా, శిథిలాల కింద చిక్కుకున్నా.. కొందరు మృత్యుంజయులుగా బయటపడుతున్నారు.

తాజాగా అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్(17) అనే బాలుడు 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, 94 గంటల పాటు తాను నరకయాతను అనుభవించానని ఆ కుర్రాడు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రం తాగి బతికానని తెలిపాడు.

Also Read..Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

ఆ టీనేజర్ దాదాపు 94 గంటలపాటు శిథిలాల మధ్య గడిపాడు. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చిన వెంటనే అతడిని గాజియాంటెప్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదన్నాడు. ఇప్పుడు తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు. మళ్లీ తన కుటుంబసభ్యులను చూస్తానని అనుకోలేదన్నాడు. భూకంపం సంభవించినప్పుడు తన కుటుంబం అంతా ఇంట్లో నిద్రిస్తున్నట్లు చెప్పాడు.

శిథిలాల కింద చిక్కుకున్నప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి తన మూత్రాన్ని తానే తాగానని చెప్పాడు. తాను నిద్రపోకుండా ఉండేందుకు ప్రతి 25 నిమిషాలకు ఒకసారి తన ఫోన్ అలారం ఆఫ్ అయ్యేలా సెట్ చేశానన్నాడు. అయితే, రెండు రోజుల తర్వాత ఫోన్ బ్యాటరీ అయిపోయిదన్నాడు. తనను కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు అద్నాన్.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు రౌండ్-ద-క్లాక్ కొనసాగుతున్నాయి. అయితే, వాతావరణ పరిస్థితులు వారి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతున్నాయి.

Also Read..Turkey,Syria Earthquake : భూకంప శిథిల్లాల్లో పుట్టిన పసిబిడ్డకు ‘అయా’అని పేరు పెట్టిన డాక్టర్..‘అయా’అంటే అర్థం ఎంత ‘అద్భుతం’గా ఉందో..!!

భూకంపం ధాటికి టర్కీ కకావికలమైంది. అనేక భవనాలు కుప్పకూలాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నేలకూలిన బిల్డింగ్ శిథిలాల కింది నుంచి పలువురు చిన్నారులు మ‌ృత్యుంజయులై బయటపడుతున్నారు. రోజుల పసికందుల నుంచి పది పన్నెండేళ్ల పిల్లలను రెస్క్యూ బృందాలు కాపాడుతున్నాయి. హతయ్ ప్రావిన్సులో ఓ బిల్డింగ్ శిథిలాల కింది నుంచి పది రోజుల పసికందును తల్లితో సహా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల్లో చిక్కుకున్న తర్వాత 90 గంటలకు ఆ తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు.

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి పిల్లాడి ఏడుపు వినిపించడంతో అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ పసికందు దగ్గరికి చేరుకున్నారు. బాబుతో పాటు తల్లిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. దాదాపు నాలుగు రోజులు చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాబు చురుగ్గానే ఉన్నప్పటికీ తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయిందని వైద్యులు చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టర్కీ, సిరియాలలో ఈ నెల 6న భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ రెండు దేశాల్లో భారీ విధ్వంసం జరిగింది. ప్రాణనష్టం విపరీతంగా ఉంది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నాటికి టర్కీ, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 25 వేలు దాటిందని, శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. భూకంప మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ భూకంపం కారణంగా సర్వం కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ట్రెండింగ్ వార్తలు