Job Reject : ఉద్యోగం కోసం అప్లై చేస్తే.. 8 ఏళ్ల తర్వాత సందేశం పంపారు.

ఉద్యోగం కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఎక్కడ ఖాళీ ఉందని తెలిసినా రెస్యూమ్ పట్టుకొని పరిగెడతారు. అక్కడ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతారు.

Job Reject : ఉద్యోగం కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఎక్కడ ఖాళీ ఉందని తెలిసినా రెస్యూమ్ పట్టుకొని పరిగెడతారు. అక్కడ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతారు. అయినా కొన్ని సార్లు ఉద్యోగం సాధించలేరు.. అది తమ దురదృష్టంలే అని చేతులు దులుపుకొని వచ్చేస్తుంటారు. అయితే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఒకటి లేదా రెండు రోజుల్లో ఉద్యోగం వచ్చిందా? రాలేదా? అనేది తెలిసిపోతుంది. కానీ ఓ మహిళకు మాత్రం ఉద్యోగం కోసం అప్లై చేసిన 8ఏళ్లకు రిజెక్ట్ అయినట్లు సందేశం వచ్చింది. అది చూసిన ఆమె ఒకింత షాక్‌కి గురయ్యారు.

చదవండి : TSRTC Jobs : RTCలో ఉద్యోగాలు ప్రకటించిన సజ్జనార్

జో జాన్సన్ అనే మహిళ 2013లో కెంట్‌లోని కాంటర్‌బరీలోని తన ఇంటి దగ్గర టీచింగ్ అసిస్టెంట్ ఖాళీ కోసం దరఖాస్తు చేసింది. ఉద్యోగం కోసం కొద్దీ రోజులు ఎదురు చూసిన ఈమె.. సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు, భర్తతోపాటు మరో ఆరుగురు ఆమె నిర్వహిస్తున్న చర్మ సంరక్షణ వ్యాపారంలో పని చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్లుగా సందేశం వచ్చింది. దానిని చూసి కాసేపు ఆలోచించిన తర్వాత కానీ ఆమెకు గుర్తు రాలేదు 2013 ఉద్యోగానికి తాను అప్లై చేసినట్లు. ఇక ఆమె ఈ విషయాన్నీ జో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది దీంతో అది వైరల్ గా మారింది.

చదవండి : Data Entry Job : ఆన్‌లైన్ డేటా ఎంట్రీ జాబ్.. మేసేజ్ వచ్చిందా? మీకు మూడినట్టే..

ట్రెండింగ్ వార్తలు