US Airport : యూఎస్ విమానాశ్రయంలో సెక్యూరిటీ బాగోతం…ప్రయాణికుల బ్యాగులో నుంచి సెక్యూరిటీ వర్కర్ల డబ్బు చోరీ

యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి డబ్బు దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్న ఘటన సంచలనం రేపింది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కార్మికులు ప్రయాణీకుల బ్యాగ్‌లలోని డబ్బు, ఇతర వస్తువులను దొంగిలించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

US Airport

US Airport : యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి డబ్బు దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్న ఘటన సంచలనం రేపింది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కార్మికులు ప్రయాణీకుల బ్యాగ్‌లలోని డబ్బు, ఇతర వస్తువులను దొంగిలించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (US Airport Officers Caught On Camera Stealing Money )

Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు ఈ ఏడాది జూన్ 29వతేదీన ప్రయాణీకుల సామాను నుంచి 600 డాలర్ల నగదు, ఇతర వస్తువులను దొంగిలించారు. (Stealing Money From Passengers Bags) చోరీ చేసిన వారిని 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా గుర్తించారు. చెక్‌పాయింట్‌లో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేసి జులైలో వారని అరెస్టు చేశారు. చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడింది.

ED Raids : అక్రమ ఇసుక మైనింగ్ కేసులో ఈడీ దాడులు

ఎక్స్ రే మెషిన్‌కు వెళ్లే మార్గంలో పర్సులు, బ్యాగుల నుంచి డబ్బు తీసుకున్నట్లు వీడియోలో వెలుగు చూసింది. ఫుటేజీలో ఒక సెక్యూరిటీ అధికారి తన చేతిని బ్యాగులో పెట్టి డబ్బు కాజేసి దాన్ని తన జేబులో పెట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఇద్దరు నిందితులు రోజుకు సగటున 1000 డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. ఈ చోరీ బాగోతంపై విచారణ పూర్తి చేసే వరకు వారిని విధుల నుంచి తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు