ED Raids : అక్రమ ఇసుక మైనింగ్ కేసులో ఈడీ దాడులు

తమిళనాడు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 34 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 8 ఇసుక రీచ్ లలో అక్రమ తవ్వకాలు జరిపారని ఈడీ కేసు నమోదు చేసింది.....

ED Raids

ED Raids : తమిళనాడు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 34 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 8 ఇసుక రీచ్ లలో అక్రమ తవ్వకాలు జరిపారని ఈడీ కేసు నమోదు చేసింది. ( Illegal Sand Mining Case) ఎస్. రామచంద్రన్, కె. రథినం, కరికాలన్ మరియు వారి సహచరులతో సహా పలువురి నివాస,వ్యాపార స్థలాలతో సహా 34 ప్రదేశాలలో ఈడీ సోదాలు చేసింది. (ED Raids At 34 Locations Across Tamil Nadu) ఈడీ దాడుల్లో రూ. 2.33 కోట్లకు సంబంధించిన లెక్కలో చూపని నగదుతో సహా వివిధ నేరారోపణ పత్రాలు దొరికాయి. ఈడీ అధికారులు రూ.12.82కోట్లను ఫ్రీజ్ చేశారు. రూ.56.86లక్షలు, 1024 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈడీ ఎక్స్ లో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు