Beautiful Mosquito: ప్రపంచంలోనే అందమైన దోమ..కుట్టినా చంపాలని అనిపించదట..!

మనిషి రక్తం పీల్చి పలు రకాల వ్యాధులకు కారణమయ్యే దోమలు కూడా అందంగా ఉంటాయట. అదే ప్రపంచంలోనే అత్యంత అందమైన దోమ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..

World Beautiful Mosquito: చీమ, దోమ,ఈగ చాలా చిన్న చిన్న ప్రాణులు. వీటిలో దోమ అంటే మనిషి భయపడిపోతాడు. ఒక చిన్నప్రాణి అంటే మనిషి ఎందుకు భయపడిపోతాడంలే..కొన్ని రకాల దోమలు కుడితే ఎన్నో రకాల వ్యాధులకు గురి అవుతాం. డెంగ్యు, మలేరియా,స్వైన్ ఫ్లూ ఇలా ఎన్నో వ్యాధులకు గురవుతాం. మనిషి రక్తాన్ని పీల్చి అనేక రకాల వ్యాధులకు కారణం ఈ చిన్న ప్రాణి. రక్తాన్ని పీల్చిజీవించే ఈ పరాన్న జీవి వ్యాధులను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసేస్తాయి. దీంతో దోమల్ని చంపటానికి ప్రభుత్వాలే రంగంలోకి దిగి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మనం ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడతాం.దోమ తెరల్నివాడతాం వాటినుంచి రక్షణ కోసం, బ్యాట్లు వాడతం వాటిని చంపటానికి.

ప్రపంచంలోనే అనేక దేశాలను భయపెట్టే ఈ చిన్న జీవి.. కనిపిస్తే చాలు ఒక దెబ్బ వేసి చంపేస్తాం. కానీ ఓ రకం దోమ మాత్రం మనల్ని కుట్టినా దాన్ని చంపాలని అనిపించదట. ఆ దోమని చూస్తే చంపడం అనే మాటే మరచిపోతామట. ఆ దోమనే చూస్తూ అలా ఉండిపోతామట. ఎందుకంటే ఆ దోమ అంత అందంగా ఉంటుందట..! రోగాలకు కారకాలయ్యే దోమల్లో అందమైనవికూడా ఉంటాయా? అని డౌట్ రావచ్చు. నిజమే మరి ప్రమాదంలో అందమైన ప్రమాదం అన్నట్లుగా..అదొక అందాల భామ అట కాదు కాదు అందాల దోమ అంట..!!

అందమైన ఈకలతో..అందమైన రంగుల కాళ్లు, ప్రకాశవంతమైన రంగులతో ఇంద్రధనస్సులా మెరుస్తూందట ఆ దోమ. ఆ అందాల దోమ పేరు ‘‘సబెథెస్ దోమ’’.ఇటువంటి దోమలు ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల్లో కనిపిస్తాయి. ఈ మస్కిటో కుటుంబం కాస్త వింతగా ఉంటుందట. కొన్ని రకాల వ్యాధుల్ని ఈ అందమైన దోమలు వ్యాపింపజేస్తాయని అంటున్నారు. రంగుల ఈకలు, ఆకుపచ్చ రంగు దేహం, కలర్స్ కాళ్లుతో అందంగా కనిపించే ఈ దోమ ఫోటోని కెనడాలోని ఒంటారియోకి చెందిన గిల్ విజెన్ తీశారు. ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ఈ దోమ ఫోటోలతో ప్రశంసలు పొందారు.

ఈ సందర్భంగా గిల్ విజెన్ మాట్లాడుతు.. ప్రకృతిలోని చిన్న కదలికలకు, కాంతి తీవ్రతలో మార్పులకు ప్రతిస్పందించే ఈ దోమను ఫొటో తీయాలంటే చాలా చాలా కష్టమని తెలిపారు. అవును మరి దోమ కంటికి కనిపించటమే కష్టమనుకుంటే ఇక దాన్ని ఫోటోలు తీయటమంటే కష్టమే మరి. ఈ అందమైన దోమలు ఎప్పడూ గుంపులుగుంపులుగా తిరుగుతుంటాయట. ‘‘సబెథెస్ దోమలు’’ ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం వంటి అనేక వ్యాధులకు ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయట.

ఈ దోమను ఫోటో తీయటానికి గిల్ ఎన్నో దోమకాటుకు గురవ్వాల్సి వచ్చిదట. ‘సబెథెస్ దోమ’’ఫోటో తీసే సమయంలో ఈ దోమతోపాటు మరిన్ని దోమలు నన్ను కుట్టాయి..కానీ తప్పలేదు. ఫోటో తీయాలంటే దోమకాటును భరించకతప్పదన్నాడు. దోమల కాటుకు భరించాలను..కానీ బ్రతికే ఉన్నానని తెలిపాడు గిల్.

కాగా..ఈ సబెథెస్ దోమలపై సైంటిస్టులు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. వీటి రూపంతో పాటు, ఈ దోమల వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? ఇంకేమన్నా ప్రమాదాలున్నాయా? ఈ దోమలు ఎటువంటి రోగాలు వ్యాప్తి చేస్తాయి? వంటి అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు