Dinesh Karthik : ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్..! కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

Dinesh Karthik Retired From IPL : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR)జట్టుపై ఆర్సీబీ జట్టు ఓటమి తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, దినేశ్ కార్తీక్ అధికారికంగా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా ఈ విషయాన్ని పేర్కొనలేదు. కేవలం మైదానంలో మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంలో ఇదే తన చివరి ఐపీఎల్ అని దినేశ్ చెప్పుకొచ్చాడు.

Also Read : RCB vs RR Eliminator : ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం.. బెంగళూరు ఇంటికి..!

ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ పై ఆర్సీబీ ఓటమి తరువాత డీకే వద్దకు వచ్చిన విరాట్ కోహ్లీ భావోద్వేగంతో హగ్ చేసుకున్నాడు. ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్, కోహ్లీతోపాటు ఇతర ఆర్సీబీ జట్టు ప్లేయర్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో దినేశ్ కార్తీక్ కు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ ముందుకు కదలిగారు. దినేశ్ కార్తీక్ కు అటువైపుఇటువైపు డూప్లెసిస్, విరాట్ కోహ్లీ నడుస్తూ చప్పట్లు కొడుతుండగా.. దినేశ్ కార్తీక్ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నరేంద్ర మోదీ స్టేడియం డీకే డీకే అనే నినాదాలతో మారుమోగిపోయింది.

Also Read : Virat Kohli : ఐపీఎల్ చ‌రిత్ర‌లో కోహ్లి ఒకే ఒక్క‌డు.. 8 వేల ప‌రుగుల మైలురాయి

దినేశ్ కార్తీక్ ఐపీఎల్ లో బెంగళూరుతో పాటు కోల్ కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ తరపున ఆడిన ఐపీఎల్ మ్యాచ్ లలో దినేశ్ కార్తీక్ 162.95 స్ట్రైక్ రేట్ తో 937 పరుగులు చేశాడు. ఇందులో 82 ఫోర్లు, 53 సిక్స్ లు ఉన్నాయి. 2024 సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడిన అతను.. 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు