Virat Kohli : ఐపీఎల్ చ‌రిత్ర‌లో కోహ్లి ఒకే ఒక్క‌డు.. 8 వేల ప‌రుగుల మైలురాయి

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Virat Kohli : ఐపీఎల్ చ‌రిత్ర‌లో కోహ్లి ఒకే ఒక్క‌డు.. 8 వేల ప‌రుగుల మైలురాయి

Virat Kohli Becomes First Batter to Score 8000 Runs in IPL History

Virat Kohli 8000 Runs : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 8వేల ప‌రుగులు చేసిన మొద‌టి ఆట‌గాడిగా కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. బుధ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి 29 ప‌రుగులు చేయ‌డం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 24 బంతుల‌ను ఎదుర్కొన్నాడు. మూడు ఫోర్లు, 1 సిక్స్ బాది 33 ప‌రుగులు చేశాడు.

అరంగ్రేట సీజ‌న్ 2008 నుంచి కోహ్లి ఐపీఎల్ ఆడుతున్నాడు. నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా కోహ్లి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. నేటి మ్యాచ్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 252 ఐపీఎల్ మ్యాచులు ఆడ‌గా 244 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి బ్యాటింగ్ చేశాడు. 38.66 స‌గ‌టు 131.97 స్ట్రైక్‌రేటుతో 8004 ప‌రుగులు చేశాడు. ఇందులో 55 అర్థ‌శ‌త‌కాలు, 8 శ‌త‌కాలు ఉన్నాయి.

MS Dhoni : ఫేస్‌బుక్‌లో ధోని పోస్ట్ వైర‌ల్‌.. ‘స‌మ‌యం ఆస‌న్న‌మైంది..’ రిటైర్‌మెంట్ పై హింట్ ఇచ్చాడా?

విరాట్ త‌రువాతి స్థానంలో శిఖ‌ర్ ధావ‌న్ ఉన్నాడు. శిఖ‌ర్ ధావ‌న్ 222 మ్యాచుల్లో 6769 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా రోహిత్ శ‌ర్మ‌, డేవిడ్ వార్న‌ర్‌, సురేశ్ రైనాలు ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లి – 252 మ్యాచుల్లో 8004 ప‌రుగులు
శిఖ‌ర్ ధావ‌న్ – 222 మ్యాచుల్లో 6769 ప‌రుగులు
రోహిత్ శ‌ర్మ – 257 మ్యాచుల్లో 6628 ప‌రుగులు
డేవిడ్ వార్న‌ర్ – 184 మ్యాచుల్లో 6565 ప‌రుగులు
సురేశ్ రైనా – 205 మ్యాచుల్లో 5528 ప‌రుగులు

Kavya Maran : ఒంటరిగా కావ్యాపాప.. ముఖంలో చిరున‌వ్వు మాయం.. త‌న‌కోసమ‌న్నా ఆడండ‌య్యా..!