Kavya Maran : ఒంటరిగా కావ్యాపాప.. ముఖంలో చిరున‌వ్వు మాయం.. త‌న‌కోసమ‌న్నా ఆడండ‌య్యా..!

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి పాలైంది.

Kavya Maran : ఒంటరిగా కావ్యాపాప.. ముఖంలో చిరున‌వ్వు మాయం.. త‌న‌కోసమ‌న్నా ఆడండ‌య్యా..!

Kavya Maran Heartbroken after SRH lost against KKR in qualifier 1

Kavya Maran : అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి పాలైంది. స‌న్‌రైజ‌ర్స్ పై విజ‌యం సాధించిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో త‌న జ‌ట్టు ఓడిపోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ య‌జ‌మాని కావ్యా మార‌న్ నిరాశ చెందింది. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. 19.3 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగులకు కుప్ప‌కూలింది. భీక‌ర ఫామ్‌లో ఉన్నఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శ‌ర్మ (3)ల‌తో పాటు నితీశ్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0) లు విఫ‌లం అయ్యారు. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55) హాఫ్ సెంచ‌రీ చేశాడు. క్లాసెన్ (21 బంతుల్లో 32) రాణించాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయ‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Sania Mirza : ఇంటి నేమ్‌ప్లేట్‌ను మార్చేసిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కొత్త నేమ్‌ప్లేట్‌లో ఎవ‌రి పేరుందంటే?

అనంత‌రం ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 13.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంక‌టేశ్ అయ్య‌ర్ (28 బంతుల్లో 51నాటౌట్‌), శ్రేయ‌స్ అయ్య‌ర్ (24 బంతుల్లో 58నాటౌట్‌) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

ఒంట‌రిగా కూర్చొన్న కావ్యా..

మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో ఆ జ‌ట్టు య‌జ‌మాని కావ్యా మార‌న్ నిరాశ‌గా క‌నిపించింది. ఆమె ఒంటరిగా కూర్చోంది. మ్యాచ్ మొత్తం విచార‌క‌ర‌మైన ముఖంతో క‌నిపించింది.


కోల్‌క‌తా ఇన్నింగ్స్ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్ ఎల్బీ కోసం ఎస్ఆర్‌హెచ్ అప్పీల్ చేయ‌గా వారికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌చ్చింది. బంతి లెగ్ వెలుప‌ల పిచ్ చేయ‌బ‌డింద‌ని డీఆర్ఎస్ చూపించింది. దీన్ని చూసిన కావ్యా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.

Nita Ambani : ముంబై య‌జ‌మాని నీతా అంబానీ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఈ సీజ‌న్ పూర్తిగా నిరాశ‌ప‌రిచింది.. రోహిత్‌, హార్థిక్‌..

ఈ మ్యాచ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్ మ్యాచ్ చేరుకునేందుకు మ‌రో అవ‌కాశం ఉంది. ఎలిమినేట‌ర్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టుతో క్వాలిఫ‌య‌ర్ 2లో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌డ‌ప‌నుంది. క్వాలిఫ‌య‌ర్ 2లో విజ‌యం సాధిస్తే స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్ చేరుకుంటుంది.