పూరీ రత్నభండార్ తాళాలు ఏమయ్యాయి? బంగారు, వజ్ర వైఢూర్యాలు క్షేమమేనా? దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు.

Jagannath Temple Ratna Bhandar : ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ ఆలయం. సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అదే పూరీ ఆయంలోని రత్న భండార్. జగన్నాథ్ ఆలయంలో రత్నభండార్ తాళం చెవులను ఎన్నికల ప్రధాన అస్త్రంగా బీజేపీ మలుచుకుంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఒడిశాలో పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

అంతటితో ఊరుకోలేదు. అత్యంత పురాతన చరిత్ర ఉన్న రత్నభండార్ తాళం చెవులు ఏమయ్యాయి? అంటూ డౌట్ లేవనెత్తారు మోడీ. అక్కడ నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రత్నభండార్ అంశం నేషనల్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఇప్పుడు భాగమైంది.

భక్తులను కాపాడటానికి దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడి సంపదను కాపాడటానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. అప్పట్లో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చే లేపింది. నెలల తరబడి పద్మనాభుడి సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్నభండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది.

Also Read : ప్రమాదమా? కుట్రపూరిత హత్యా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై అనేక అనుమానాలు

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు