IPL 2024 : కోహ్లీతోనే ఆటలా.. ఫలితం అలాగే ఉంటది మరి! వీడియో వైరల్

ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. ఆర్ఆర్ జట్టు బ్యాటింగ్ సమయంలో

Dhruv Jurel Run Out : ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 19ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో ఈనెల 24న జరిగే క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ జట్టు తలపడనుంది. ఆ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడుతుంది.

Also Read : Dinesh Karthik : ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్..! కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. ఆర్ఆర్ జట్టు బ్యాటింగ్ సమయంలో 14వ ఓవర్ క్యామ్రిన్ గ్రీన్ వేశాడు. క్రీజులో ఉన్న పరాగ్ బంతిని ఫుల్ షాట్ ఆడాడు. ఆ బాల్ బౌండరీ వైపు వెళ్లింది. బౌండరీ వద్ద బాల్ ను అందుకున్న విరాట్ కోహ్లీ రాకెట్ వేగంతో బంతిని బౌలర్ వైపు విసిరాడు. ఈ క్రమంలో రెండో పరుగుకోసం ప్రయత్నంలో జురెల్ క్రీజులోకి వచ్చేలోపే విరాట్ బౌండరీ లైన్ వద్ద నుంచి విసిరిన బాల్ వికెట్ల వద్దకు చేరింది. గ్రీన్ ఆ బంతితో వికెట్లను పడగొట్టాడు. కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ తో జురెల్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

Also Read : RCB vs RR Eliminator : ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం.. బెంగళూరు ఇంటికి..!

కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ పై వ్యాఖ్యాత సునీల్ గావాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లీ రాకెట్ వేగంతో బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకొని వికెట్ల వైపు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కోహ్లీ చేతికి బాల్ వెళ్లాకకూడా రన్ తీస్తే ఇలా ఉంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు