Anything with Saree : చీరకట్టుతో ఎక్సర్ సైజ్, జిమ్నాస్టిక్స్, ఫుట్ బాల్.. ఏదైనా సాధ్యమంటున్న మహిళలు

చీర కట్టుకుంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందిగా ఫీలై మహిళలు ఉంటారు. స్పీడ్‌గా నడవలేమని.. కాళ్లకు అడ్డం పడుతుంటుందని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలకు చెక్ పెడుతూ చీరతో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు 5 గురు మహిళలు.

Anything with saree

Anything with saree : చీరలంటే ఆడవారికి మహా ఇష్టం. కానీ అన్ని వేళలా చీరలు ధరించడం కాస్త ఇబ్బంది అనేవారు లేకపోలేదు. చీర కట్టుకుంటే స్పీడుగా నడవలేం.. ఏ పని ఈజీగా చేయలేం .. కాళ్లకు అడ్డు పడుతుంటుంది అని కొందరు మహిళలు అంటూ ఉంటారు.. ఇలాంటి మాటలు కొట్టిపారేస్తూ చీరకట్టుతో ఏదైనా సాధ్యమని నిరూపించారు కొందరు మహిళలు. కొత్త సంప్రదాయానికి తెర తీసిన వారి గురించి తెలుసుకుందామా?

Shruthi Haasan : చలిలో చీరతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. కానీ తప్పలేదు..

చీర కట్టుకున్నా చక్కగా వ్యాయామం చేయవచ్చు అంటున్నారు ఫిట్ నెస్ ఔత్సాహికురాలు రీనా సింగ్. ఆమె వర్క్ అవుట్ చేసేటప్పుడు చీరను మాత్రమే ధరిస్తారట. చాలా వీడియోల్లో ఆమె చీర కట్టుతో వ్యాయామం చేస్తూ కనిపించారు. ఫిట్ నెస్ నియమాలు పాటిస్తూనే సంప్రదాయ దుస్తులు ధరించవచ్చని రీనా నిరూపించారు. ఈమె వీడియో చాలా వైరల్ అయ్యింది. పరుల్ అరోరా అనే 24 సంవత్సరాల జిమ్నాస్ట్ చీరలో బ్లాక్ పిప్ చేయడం అదరహో అనిపించింది. ఆమె వీడియో కూడా ట్విట్టర్‌లో చాలా వైరల్ అయ్యింది. నెటిజన్లు అందరూ పాజిటివ్‌గా స్పందించారు.

Red Saree Flag : ఎర్ర చీరతో ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గ్రామీణ మహిళ

చీరలో నడక సరిగా రాదు.. స్పీడ్‌గా నడవలేం అంటారు చాలామంది మహిళలు .. కానీ ఒడిశాకు చెందిన మధుస్మిత జెనా అది సుసాధ్యం అని చేసి చూపించారు. మాంచెస్టర్ మారథాన్‌ 2023 లో  ఎరుపురంగులో చీర కట్టుకుని వాక్ చేసి చీర ధరించినా ఏదైనా చేయగలం అని నిరూపించారు. డ్యాన్స్‌లో క్లిష్టమైన భంగిమలు చేయడం చీరతో సాధ్యమా అంటే.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ డ్యాన్సర్ రుక్మిణి విజయ్ కుమార్ చేసి చూపించారు. ఆమె చీరలో చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ను ఫిదా చేసింది.

Indian Saree : రెస్టారెంట్‌‌లోకి చీరతో వస్తే..నో ఎంట్రీ….వీడియో వైరల్

చీరకట్టుకుని ఫుట్ బాల్ కూడా ఆడగలమని గ్వాలియర్ మహిళలు చూపించారు. చీరతో మైదానంలో పరుగులు పెడుతూ బంతిని తన్నుతూ అందరిని ఉత్సాహ పరిచారు. ఓ వైపు సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. మరోవైపు చీరకట్టుతో ఏదైనా చేయగలమని నిరూపిస్తున్న వీరందరికి అభినందనలు చెప్పాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు