Karnataka Assembly : ఎమ్మెల్యేనంటూ కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో 72 ఏళ్ల వ్యక్తి హల్ చల్ .. ఏం చేశాడో తెలుసా..?

ర్ణాటక అసెంబ్లీలో ఎవరు ఊహించిన ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేలా అసెంబ్లీలోకి వచ్చాడు.దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నాడు. అయినా చాలాసేపు ఎవ్వరు అతడిని గుర్తించలేదు.

Karnataka Assembly ..Budget session

Karnataka Assembly ..Budget session : కర్ణాటక అసెంబ్లీలో ఎవరు ఊహించిన ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేలా అసెంబ్లీలోకి వచ్చాడు.దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నాడు. అయినా చాలాసేపు ఎవ్వరు అతడిని గుర్తించలేదు. 15 నిమిషాలపాటు అతనికి ఎవ్వరు గుర్తించలేదు. చక్కగా అటూ ఇటు చక్కర్లు కొట్టాడు. ఎమ్మెల్యే సీటులో కూర్చున్నాడు. చివరికి ఓ ఎమ్మెల్యే గుర్తించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

అతను చిత్రదుర్గ జిల్లాకు చెందిన తిప్పేరుద్ర అనే వ్యక్తిగా గుర్తించారు. అతను సాగర్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణగా నటిస్తూ అసెంబ్లీలోకి వచ్చిన అతను అసెంబ్లీ హాల్లో చక్కగా కలియతిరిగాడు. ఆ తరువాత అసెంబ్లీ హాల్లో ఉన్న దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ సీటులో కూర్చున్నాడు. అతడిని చూసి అనుమానించిన జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ మార్షల్స్‌కు, స్పీకర్‌కు సమాచారం అందించారు.వారు వచ్చి బయటకు తీసుకెళుతుండగా రాను నేను ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలి అంటూ పట్టుపట్టారు. దానికి ఎమ్మెల్యే అనటానికి ఆధారం చూపించాలని అడిగారు. దానికి అతని వద్ద ఏమీ లేకపోవటంతో మార్షల్స్ అతనికి బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు. తరువాత అతనిని పోలీసులకు అప్పగించగా వారు అరెస్ట్ చేశారు.

సదరు వ్యక్తి విజిటర్స్ పాస్‌తో లోపలికి ప్రవేశించాడని గుర్తించారు. తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనని చెప్పడంతో మార్షల్స్ కూడా నిజమేననుకుని లోపలికి విడిచిపెట్టటంతో ఈ రాద్దాంతం జరిగింది. అతనిపై నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై సిద్దరామయ్య తన చారిత్రాత్మక బడ్జెట్ ను సమర్పించిన రోజే కర్ణాటక అసెంబ్లీలో చరిత్రలో తొలిసారిగా ఈ ఘటన జరిగింది అంటూ చమత్కరించారు ప్రతిపక్ష నేతలు.
కాగా ఈ సారి అసెంబ్లీలో చాలామంది కొత్తవారు కావటంతో మార్షల్స్ వారిని గుర్తించలేక సదరు వ్యక్తిని లోపలికి అనుమతించారని పోలీసు అధికారి తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రికార్డు స్థాయిలో 14వ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజునే ఇది జరిగింది. మే 10న రాష్ట్రంలో అజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొత్త ఏర్పాటు అయిన తొలి బడ్జెట్ ఇది.శుక్రవారం నాటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

 

ట్రెండింగ్ వార్తలు