Suryakumar Yadav : నా కెప్టెన్సీ సీక్రెట్ అదే.. సూర్య‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

భార‌త టీ20 క్రికెట్‌లో నూత‌న శ‌కం మొద‌లు కానుంది.

Suryakumar Yadav reveals his captaincy Mantra

Suryakumar Yadav captaincy : భార‌త టీ20 క్రికెట్‌లో నూత‌న శ‌కం మొద‌లు కానుంది. పొట్టి క్రికెట్‌కు రోహిత్ శ‌ర్మ వీడ్కోలు చెప్ప‌డంతో టీ20ల్లో టీమ్ఇండియా కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌ను బీసీసీఐ నియ‌మించింది. జూలై 27న శ్రీలంకతో ఆరంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా త‌న‌దైన ముద్ర వేయాల‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ భావిస్తున్నాడు. కాగా.. రోహిత్ శ‌ర్మ త‌రువాత టీ20ల్లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపిక అవుతాడ‌ని భావించారు. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు, కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ రావ‌డంతో హార్దిక్‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

కాగా.. కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ ఎంపికైన త‌రువాత.. అత‌డు మాట్లాడిన ఓ పాత వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో సూర్య త‌న కెప్టెన్‌గా తాను ఎలా వ్య‌వ‌హ‌రిస్తాను అన్న విష‌యాల‌ను వెల్ల‌డించాడు. రోహిత్, హార్దిక్‌ల గైర్హ‌జ‌రీలో సూర్య గ‌తంలోనూ టీ20 కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి సార‌థ్యంలో 2023లో ఆస్ట్రేలియా పై 4-1తో టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా, ద‌క్షిణాఫ్రికా సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది.

Ishan Kishan : ఇషాన్ కిష‌న్ దారెటు..? టీమ్ఇండియాలో రీ ఎంట్రీ క‌ష్ట‌మేనా..? ఒక్క‌టే మార్గం..!

ఆ వీడియోలో.. కొత్త బాధ్య‌త‌ల‌ను ఎంతో ఆస్వాదిస్తున్నాను. మేమంతా క‌లిసి ఎంతో స‌మ‌యం గ‌డిపాము. ఆట‌గాళ్ల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల గురించి నాకు తెలుసు. మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా ఆట‌గాళ్ల‌తో మంచి అనుబంధం ఉంది. అని సూర్య కుమార్ అన్నాడు. అన్ని విష‌యాల్లో చాలా సింపుల్‌గా ఉండేలా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌క్రియ‌ను తాను ఎక్కువ‌గా న‌మ్ముతాన‌ని తెలిపాడు. ఆట‌గాళ్ల‌ను కూడా సింపుల్‌గా ఉండ‌మ‌నే చెబుతాను. భిన్నంగా ప్ర‌య‌త్నించ‌కుండా తమదైన శైలిలోనే ఆడాల‌ని ఆట‌గాళ్ల‌కు సూచిస్తాను అని చెప్పాడు.

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన శుభ్‌మ‌న్ గిల్ శ్రీలంక‌తో సిరీస్‌లో సూర్యకుమార్‌కు డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి ఇచ్చిన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌లను లంక‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యారు.

Shashi Tharoor : లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. సెల‌క్ట‌ర్ల‌పై శ‌శి థ‌రూర్ మండిపాటు..

లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త టీ20 జ‌ట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

ట్రెండింగ్ వార్తలు