Shane Warne : షేన్ వార్న్ బ‌యోపిక్‌.. రొమాంటిక్ స‌న్నివేశం చేస్తూ యాక్ట‌ర్స్ ఆస్ప‌త్రి పాలు..

దివంగత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ దిగ్గ‌జ ప్లేయ‌ర్ ఆట‌తో ఎంత‌ కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నాడో అత‌డి వ్య‌క్తి గ‌త జీవితంలో అంత‌కంటే ఎక్కువ వివాదాలే ఉన్నాయి.

Shane Warne Biopic

Shane Warne Biopic : దివంగత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ దిగ్గ‌జ ప్లేయ‌ర్ ఆట‌తో ఎంత‌ కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నాడో అత‌డి వ్య‌క్తి గ‌త జీవితంలో అంత‌కంటే ఎక్కువ వివాదాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం వార్న్ బ‌యోపిక్(Shane Warne Biopic) తెర‌కెక్కుతోంది. ఇందులో అత‌డి క్రికెట్ కెరీర్‌తో పాటు వివాదాల‌ను కూడా చూపించ‌నున్నారు. ఇది ఓ సిరీస్‌గా ప్ర‌సారం కానున్న‌ట్లు తెలుస్తోంది. ‘వార్నీ’ పేరుతో రానున్న ఈ బ‌యోపిక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అయితే.. తాజాగా షూటింగ్‌లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించే స‌మ‌యంలో న‌టీ, న‌టుడు గాయ‌ప‌డ్డాడు. వెంట‌నే వీరిద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. షేన్ వార్న్ పాత్ర‌లో అలెక్స్ విలియమ్స్ ఆయ‌న భార్య సిమోన్ పాత్ర‌లో మార్నీ కెన్నెడీ న‌టిస్తున్నారు. క‌థ‌లో భాగంగా వీరిద్ద‌రి మ‌ధ్య శృంగార స‌న్నివేశం తెర‌కెక్కిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ICC Test Rankings : చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు.. దిగ‌జారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్స్‌

ఈ ప్ర‌మాదం పై న‌టి మార్నీ కెన్నెడీ స్పందించింది. ‘షేన్ వార్న్‌, సియోన్ యుక్త వ‌య‌సులో ఉన్న‌ప్ప‌టి స‌న్నివేశం అది. నేను, ఇంకా అలెక్స్ ఇద్దరం కారిడార్‌లో న‌డుచుకుంటూ వెలుతుంటాం. అక్క‌డ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్‌పై ప‌డిపోవాలి ఇదీ క్లుప్లంగా సీన్‌. అయితే.. మేము బెడ్ పై కాకుండా కింద ప‌డ్డాము. వెంట‌నే ప‌క్క‌నున్న వాళ్లు అప్ర‌మ‌త్త‌మై మ‌మ్మ‌ల్ని లేపి ఎమ‌ర్జెన్సీ రూమ్‌కి త‌ర‌లించారు. అలెక్స్ త‌ల‌కు గాయం కావ‌డంతో బ్యాండేజీ వేశారు. ఇక నాకు మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయ‌మైంది.’ అని కెన్నెడీ తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా త‌రుపున షేర్ వార్న్ 145 టెస్టులు, 194 వన్డేల్లో ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వ‌న్డేల్లో 293 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో టెస్టుల్లో 3,154 ప‌రుగులు, వ‌న్డేల్లో 1,018 ప‌రుగులు చేశాడు. గ‌తేడాది థాయ్‌లాండ్‌లో వెకేష‌న్‌లో ఉండ‌గా వార్న్ మ‌ర‌ణించాడు.

Rishabh Pant : పంత్‌ను చూశారా.. ఎవ‌రి సాయం లేకుండానే మెట్లు ఎక్కేస్తున్నాడు.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు