AIADMK MLAs: నల్లచొక్కాలు వేసుకుని అసెంబ్లీకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. పన్నీర్ సెల్వం మాత్రం తెల్లచొక్కా..

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ తీరు, అసెంబ్లీ స్పీకర్ అప్పావు తీరు పట్ల పట్ల ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాజీ సీఎం ఈ.పళనిస్వామి నేతృత్వంలో నిరసన తెలిపారు. అయితే, ఇవాళ వారంతా అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకుని వస్తే మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మాత్రం తెల్ల చొక్కా వేసుకుని వచ్చారు.

AIADMK MLAs: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ తీరు, అసెంబ్లీ స్పీకర్ అప్పావు తీరు పట్ల పట్ల ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాజీ సీఎం ఈ.పళనిస్వామి నేతృత్వంలో నిరసన తెలిపారు. అయితే, ఇవాళ వారంతా అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకుని వస్తే మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మాత్రం తెల్ల చొక్కా వేసుకుని వచ్చారు.

పళనిస్వామి వెనకాలే ఎమ్మెల్యేలు చాలా మంది నల్ల చొక్కాల్లో వస్తే, పన్నీర్ సెల్వం మాత్రం తెల్ల దుస్తుల్లో అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అసెంబ్లీ లోపల కూడా ఆయన తెల్ల దుస్తుల్లోనే కనపడ్డారు. డీఎంకే ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.

అలాగే, అసెంబ్లీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి కేటాయించిన సీట్ల క్రమంపై కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానంపై ఇవాళ సెషన్ నిర్వహించారు.

ఈ నెల 13న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీ ప్రసంగించనున్నారు. కాగా, కొన్ని నెలల క్రితం పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు కొనసాగిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో వారిద్దరు పక్కపక్కనే కూర్చునేలా ఏర్పాటు చేశారు.

Jammu And Kashmir : విరిగిపడ్డ మంచు పెళ్లలు..కశ్మీర్ లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

ట్రెండింగ్ వార్తలు