లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సర్‌ప్రైజ్‌గా ఉంటాయి: ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో రాహుల్ గాంధీ

Rahul Gandhi: దేశంలో 90 శాతం ఉన్న పేద, దళితులు, వెనుకబడి ఉన్న వాళ్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని..

ఢిల్లీలోని ఆంధ్రభవన్‌కు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అక్కడి ఆంధ్ర క్యాంటీన్‌లో కేసీ వేణుగోపాల్ తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లనూ ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు.

దేశంలోని సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సర్‌ప్రైజ్‌గా ఉంటాయని ఆయన తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకీ రానుందని తెలిపారు. నరేంద్ర మోదీ దేశ రాజ్యాంగం, రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

దేశంలో 90 శాతం ఉన్న పేద, దళితులు, వెనుకబడి ఉన్న వాళ్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి అందులోని వారితో మాట్లాడారు. రాహుల్ తో ప్రయాణికులు సెల్ఫీలు తీసుకున్నారు. కన్నయ్య కుమార్‌ కూడా రాహుల్ గాంధీతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీలో మే 25న పోలింగ్ జరుగుతుంది.

పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు