Tiger : అయ్యో పాపం..! వాహనం ఢీకొట్టడంతో పులికి ఏమైందో చూశారా.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని నవేగావ్ నాగ్జిరా అభయారణ్యం గుండావెళ్లే భండారా - గోండియా హైవేను దాటుతున్న పులిని హ్యుందాయ్ కెట్రా వాహనం ఢీకొట్టింది.

Tiger dies in Maharashtra : మహారాష్ట్రలోని నవేగావ్ నాగ్జిరా అభయారణ్యం గుండావెళ్లే భండారా – గోండియా హైవేను దాటుతున్న పులిని హ్యుందాయ్ కెట్రా వాహనం ఢీకొట్టింది. పులి రోడ్డు దాటుతుండటంతో వేగంగా వెళ్లిన కెట్రా వాహనం ఢీకొట్టడంతో పులి కాలుకు తీవ్రగాయమై కదలలేని పరిస్థితిలో రోడ్డుపై పడిపోయింది. రోడ్డుపైనే బాధతో మూలుగుతూ కూర్చున్న పులి.. కొద్దిసేపటి తరువాత బలవంతంగా రోడ్డును దాటింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Viral Video : కరెన్సీ నోట్లతో ముఖాన్ని తుడుచుకున్న పాక్ క్రికెటర్లు.. ఏకిపారేసిన నెటిజన్లు..!

అయితే, పులికి గాయమైన విషయాన్ని వాహనదారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకొని పులికి తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. వెంటనే చికిత్సకోసం నాగ్ పూర్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే పులి ప్రాణాలు కోల్పోయింది. పులిని వాహనం ఢీకొట్టిన సమయంలో వీడియోను ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. వాహనాలు నెమ్మదిగా నడపాలని హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ, కెట్రా డ్రైవర్ నిర్లక్ష్యంతో పులి చనిపోయిందని రాశాడు. ఈ రహదారి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్నందున రహదారిసైతం ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ 40kmph మించి ప్రయాణించొద్దని హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు