లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 58 స్థానాలకు పోలింగ్

ఆరో విడత ఎన్నికల కోసం 1.14 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ.

Lok Sabha Elections 2024 : ఆరో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరో విడతలో భాగంగా 58 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు.. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ నిర్వహిస్తారు. రేపు (మే 25) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు జరిగిన 5 విడతల్లో 25 రాష్ట్రాల్లో 428 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఆరో విడతలో ఎన్నికలు జరిగే 58 స్థానాల్లో 49 జనరల్, 2 ఎస్టీ, 7ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఆరో విడత ఎన్నికల కోసం 1.14 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ. 11.13 కోట్ల మంది ఓటర్లలో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళ ఓటర్లు, 5120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 85 సంవత్సరాల పైబడిన ఓటర్లు 8.93 లక్షల మంది, 100 సంవత్సరాల పైబడిన వారిలో 23,659 మంది ఓటర్లు ఉన్నారు. 6వ విడత ఎన్నికల కోసం 20 ప్రత్యేక రైళ్లు వినియోగిస్తున్నారు.

ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు
ఢిల్లీలో 7 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హీట్ వేవ్ దృష్ట్యా ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. మొదటిసారి పోలింగ్ కేంద్రాల వద్ద పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీలో రేపు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలో ఎండ వేడిమి దృష్ట్యా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాల పరిధిలో 13,640 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో 2800 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది ఈసీ.

Also Read : యుద్ధ మేఘాలు.. విశ్వశాంతికి ముప్పుగా మారిన పరిస్థితులు ఇవే..

 

 

ట్రెండింగ్ వార్తలు