Akhanda: ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న పర్ఫెక్ట్ మాస్ సినిమాని బాలయ్య తీసుకుని వచ్చేశాడు. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా అఖండ.. అఖండ విజయం సాధించింది.
కరోనా తర్వాత ఆడియన్స్‌ని జాతరకు రప్పించినట్లు రప్పించిన సినిమా అఖండ. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఎలా కావాలో అన్నీ ఇందులో ఉంచాడు డైరెక్టర్.. ఎలివేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్.
మాస్ లెక్కలు, ఎమోషన్ పట్టేసి తెరకెక్కించిన అఖండ.. వర్కవుట్ అవడంతో కలెక్షన్లు కూడా ప్రభంజనంలా వస్తున్నాయి. సినిమా నాలుగు రోజుల్లో భారీ విజయాన్ని అందుకుంది.
అఖండ సినిమా నాలుగు రోజుల మొత్తం కలెక్షన్స్:
నైజాంలో రూ. 12.11కోట్లు,
సీడెడ్‌లో రూ. 9.81కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.3.74కోట్లు,
ఈస్ట్‌లో రూ. 2.61కోట్లు,
వెస్ట్‌లో రూ. 2.04కోట్లు,
గుంటూరులో రూ.3.26కోట్లు,
కృష్ణాలో రూ. 2.28కోట్లు,
నెల్లూరులో రూ. 1.71కోట్లతో
రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 37.56 కోట్లు షేర్, 59.10కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.25కోట్లు, ఓవర్సీస్లో రూ. 4.05కోట్లు రాబట్టింది. ఫలితంగా రూ. 44.86కోట్లు షేర్ రాబట్టింది. టోటల్ గ్రాస్ 73.60కోట్లుగా ఉంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలంటే..
ప్రపంచవ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగింది అఖండ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లు కాగా.. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.44.86కోట్లు వసూలు చేసింది. అంటే మరో 9కోట్లు వస్తే సినిమా హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.