Rakul Preet Singh : భర్తతో ఆ దేశానికి హనీమూన్‌కి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. బికినిలో ఫొటోలు వైరల్..

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కలిసి హనీమూన్‌కి వెళ్లారు.

Rakul Preet Singh and Her Husband Jackky Bhagnani went to Fiji Country for Honeymoon

Rakul Preet Singh : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడి కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి ఇటీవల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు తర్వాత కూడా ఈ జంట బాలీవుడ్ లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కలిసి హనీమూన్‌కి వెళ్లారు.

ఈ బాలీవుడ్ జంట పెళ్లి తర్వాత హనీమూన్‌ కి ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్ని రోజులు వర్క్ బిజీతో గడిపేశారు. అందుకే పెళ్లి తర్వాత రెండు నెలలకు హనీమూన్‌ కి ఫిజి దేశానికి వెళ్లారు రకుల్ – జాకీ. పస్‌ఫిక్ సముద్రంలో ఉన్న చిన్న దేశం ఫిజి ఐస్‌ల్యాండ్స్ లో సముద్రాలు, బీచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. ఇక రకుల్ బికినిలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Kalki Event : రేపే కల్కి ఈవెంట్.. భారీగా అభిమానుల సమక్షంలో.. ఎక్కడ.. ఏ టైంకి..?

రకుల్ ఫిజి ఐస్‌ల్యాండ్స్ లో దిగిన బికినీ ఫొటోలు షేర్ చేసి.. తన భర్త జాకీ భగ్నానీ తన కోసం ఫోటోగ్రాఫర్ గా మారినట్టు, అక్కడ ప్రకృతితో ప్రేమలో పడినట్టు, ఎప్పట్నుంచో వెల్దామనుకున్న ఫిజికి వెళ్లినట్టు తెలిపింది. దీంతో రకుల్ బికినీ ఫొటోలు వైరల్ గా మారాయి.