OMG 2 : దేవుడి సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడమా..? ‘ఓ మై గాడ్’ రిలీజ్‌కి ముందే 27 సన్నివేశాలు..!

అక్షయ్ కుమార్ OMG 2 కి ఎట్టకేలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చింది. అయితే ఒక దేవుడి సినిమాకి బోర్డు 'A' సర్టిఫికెట్ ఇవ్వడం..

Akshay Kumar – OMG 2 : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన OMG (Oh My God) మూవీ 2012 లో రిలీజ్ అయ్యి అప్పటిలో మంచి సంచలనం అయ్యింది. దేవుడి పేరు చెప్పి పుట్టుకొస్తున్న దొంగ స్వామీజీలు గురించి ఆ మూవీ తెరకెక్కింది. ఆ సమయంలో కొన్ని విమర్శలు ఎదురుకున్నప్పటికీ మంచి విజయం అందుకుంది. దీంతో ఆ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. టాలీవుడ్ లో వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్.. ‘గోపాల గోపాల’ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

nithiin – dil raju : హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. పోటీగా దిల్‌రాజు రెడీ!

కాగా దాదాపు 11 ఏళ్ళ తరువాత ఇప్పుడు అక్షయ్ దానికి సీక్వెల్ తీసుకు వస్తున్నాడు. మొదటి పార్ట్ లో అక్షయ్ కృష్ణుడిగా కనిపిస్తే, సెకండ్ పార్ట్ లో శివుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సీక్వెల్ మెయిన్ స్టోరీ.. స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి ఉండబోతుందని తెలుస్తుంది. దీంతో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు దగ్గర పెద్ద సమస్య ఎదురైంది. ఇటీవల ఆదిపురుష్ అండ్ హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) విషయంలో సెన్సార్ బోర్డు అనేక విమర్శలు ఎదురుకుంది.

Allu Arjun : జీన్స్‌ సీన్స్‌ను త్రివిక్రమ్‌ రీక్రియేట్‌ చేయబోతున్నారా?

దీంతో OMG 2 విషయంలో అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు 27 సన్నివేశాలకు కత్తెర్లు వేసినట్లు సమాచారం. ఇక మూవీ టీం చేసేదిలేక ఆ చేంజస్ అన్ని మార్చుకొని వచ్చింది. అయినా సరి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఇక ఒక దేవుడి సినిమాకి A సర్టిఫికెట్ రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. దీంతో మూవీ పై కొంత నెగిటివిటీ కూడా వస్తుంది. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. ఆగష్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు