లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలే: హీరో రాజ్‌త‌రుణ్‌

తనపై లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్‌త‌రుణ్‌ స్పందించారు.

Hero Raj Tarun: తనపై లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలను హీరో రాజ్‌త‌రుణ్‌ తోసిపుచ్చారు. లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆమెను పెళ్లిచేసుకునే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తాను కూడా పోలీసు కేసు పెట్టిన తర్వాతే మాట్లాడతానని, అంతవరకు మీడియా తనకు అండగా నిలబడాలని కోరారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో తనపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు.

2014 నుంచి రెండుమూడేళ్లు లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఆమె వ్యవహారశైలి నచ్చక బయటకు వచ్చేశానని రాజ్‌త‌రుణ్‌ వెల్లడించారు. డ్రగ్స్ మానేయమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదన్నారు. మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య సన్నిహితంగా ఉంటోందని ఆరోపించారు. వారిద్దరికీ ఎలా పరిచయం అయిందో తనకు తెలియదన్నారు. తన ఫ్లాట్ లోనే వారిద్దరూ ఉంటున్నారని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని తెలిసి తన కంటే ముందే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.

లావణ్యను భరించలేకే ఆమెను వదిలి వెళ్లిపోయినట్టు రాజ్‌త‌రుణ్‌ చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని అన్నారు. తానే కావాలంటున్న లావణ్య.. మస్తాన్ సాయితో పెళ్లి చేయాలని గుంటూరులో కేసు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. ఈ కేసును సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తన దగ్గర ఉందన్నారు. లావణ్యకు తానేమీ చెప్పలనుకోవడం లేదని, లీగల్ ఎడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె మాట్లాడతానని స్పష్టం చేశారు.

Also Read : హీరో రాజ్‌తరుణ్‌ మోసం చేశాడంటూ పోలీసుల‌కు యువతి ఫిర్యాదు

పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు
”నేను లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం నిజమే. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఫేస్బుక్ ద్వారా లావణ్య పరిచయం అయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా స్నేహం మరింతగా బలపడింది. రెండు మూడు ఏళ్ళు కలిసి ఉన్నాం.. ఆ తర్వాత మేము దూరం అయ్యాం. లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అలాంటప్పుడు ఆమెతో నేను ఎలా ఉంటాను? లావణ్యను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు మాట ఇవ్వలేద”ని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు