Allu Arjun: రూల్స్ బ్రేక్.. మొన్న తారక్.. ఇప్పుడు బన్నీ, కళ్యాణ్ రామ్!

రూల్స్ బ్రేక్ చేసిన తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌లకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ల కార్లకు ఉన్న బ్లాక్స్..

Allu Arjun: రూల్స్ బ్రేక్ చేసిన తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌లకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ల కార్లకు ఉన్న బ్లాక్స్ స్క్రీన్‌ను జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌ రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ తమ కార్లలో అటుగా వెళ్తున్నారు. పోలీసులు వారి కార్లను ఆపి కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్‌ స్క్రీన్‌ తొలగించారు. ఒక్కో కారుకు రూ.700 చొప్పున చలాన్లు విధించారు.

Jr NTR: తారక్ కారు ఆపి సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు!

గతం వారం కూడా జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఎన్టీఆర్ కారును కూడా ఆపిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తులు కారులో పోలీసులు తమ డ్యూటీని చేసి జరిమానా విధించారు. ఇప్పుడు ఇలా బన్నీ, కళ్యాణ్ రామ్ వాహనాలకు కూడా అదే తరహాలో బ్లాక్ స్క్రీన్ తొలగించి జరిమానా విధించారు. హీరోల వాహనాలు మాత్రమే కాదు.. ఇలా నిబంధనలు పాటించని మరో 80 వాహనాలకు కూడా చలాన్లు రాసి.. కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Allu Arjun : మేనేజర్ పెళ్ళికి సడెన్‌గా వచ్చి సర్‌ప్రయిజ్ ఇచ్చిన అల్లు అర్జున్

అయితే.. సెలబ్రిటీలు ఎందుకు ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.. బ్లాక్ స్క్రీన్ ఉపయోగించడం చట్టవిరుద్దామా అనే చర్చలు కూడా సహజంగానే వస్తుంటాయి. నిజానికి వై- క్యాటగిరి, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ వంటి భద్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్లాక్ స్క్రీన్ ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ వాహనాలకు మినహా ఇతరులెవరూ బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలు ఇలా బ్లాక్ స్క్రీన్‌ వేసుకోవడం నిబంధనలకు విరుద్దం కిందకే వస్తుంది. అయితే.. అలా బ్లాక్ స్క్రీన్ లేకపోతే ట్రాఫిక్ లో సామాన్య ప్రజలు వాళ్ళను గుర్తుపట్టడంతో అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే వీళ్ళు ఈ విషయంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు