Jr NTR: తారక్ కారు ఆపి సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు!

టాలీవుడ్‌ స్టార్‌, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కారును ఆపిన జూబ్లీహిల్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్..

Jr NTR: టాలీవుడ్‌ స్టార్‌, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కారును ఆపిన జూబ్లీహిల్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ఆదివారం నుండి సోదాలు నిర్వహించారు. సోమవారం రెండోరోజు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించి నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చలాన్లు విధించారు. సోమవారం ఒక్కరోజే మొత్తం 90 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!

ఇక, బ్లాక్ సీలింగ్, అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను కూడా వదలని పోలీసులు అక్కడే వాటిని తొలగించారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ కారును కూడా ఆపిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తులు కూడా కారులో ఉన్నట్లు తెలుస్తోంది. కారులో వ్యక్తులు ఎంత చెప్పినా వినని పోలీసులు నిబంధనలకు అనుగుణంగా తమ డ్యూటీని చేసేశారు.

Jr NTR: టాప్ 10 దర్శకులతో తారక్.. సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్!

ఎన్టీఆర్ కారు మాత్రమే కాదు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మరో వాహనానికి.. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ జాఫర్ హుస్సేన్ మేరాజు స్టిక్కర్ ఉన్న కారు, ఏపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్లతో వెళ్లే కార్లను కూడా సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆ వాహనాల నుండి స్టిక్కర్లను, బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. టాఫిక్ చలనాలపై భారీ రాయితీలు ప్రకటించగా.. మార్చి 31 వరకు ఈ రాయితీలు వర్తించనున్నాయి. తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనదారుల నుండి పెండింగ్ చలనాలను కూడా వసూలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు