You Tube Fame Sreekanth Reddy Announced his First Movie Lorry Chapter-1 and Released first look Poster
Sreekanth Reddy : ఒక సినిమాకి వివిధ విభాగాల్లో చాలా మంది పనిచేస్తారు. కానీ చాలా తక్కువమంది హీరో, దర్శకత్వం, సంగీతం, నిర్మాణం.. ఇలా అన్ని బాధ్యతలు చేపడతారు. హీరో, డైరెక్షన్, నిర్మాణం.. లాంటివి చాలామంది చేసినా సంగీతం కూడా అంటే SV కృష్ణారెడ్డి, RP పట్నాయక్.. లాంటి పలువురు మాత్రమే గుర్తుకువస్తారు. తాజాగా ఓ కొత్త అబ్బాయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే మొదటి సినిమాతోనే హీరో, దర్శకత్వం, సంగీత దర్శకుడు, నిర్మాత, ఫైట్ మాస్టర్.. అవతారాలు ఎత్తాడు.
కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ కథ, స్టంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మాతగా కూడా ‘లారి చాప్టర్ -1’ అనే సినిమాని ప్రకటించారు. చెన్నై లయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి అనంతరం టాలీవుడ్ లో పలు సినిమాలకు వివిధ వివిధ శాఖల్లో పనిచేసి, యూట్యూబ్ లో కూడా పలు ప్రాంక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించి పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు సినిమాతో వస్తున్నాడు శ్రీకాంత్.
Also Read : Satyabhama Song : కాజల్ అగర్వాల్ కోసం పాట పాడిన కీరవాణి.. ‘సత్యభామ’ కోసం..
శ్రీకాంత్ రెడ్డి ఆసం తన మొదటి సినిమా ‘లారి చాప్టర్ -1’ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో చంధ్ర శిఖ హీరోయిన్ గా నటించగా, రాఖీ సింగ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ.. డైరెక్షన్ కోర్స్ చేసి అనంతరం యూట్యూబ్ లో కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు ‘లారి చాప్టర్ -1’ సినిమాతో రాబోతున్నాను. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేస్తాం. ఆల్రెడీ సినిమా మొత్తం పూర్తయి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు.