TSRTC MD Sajjanar : అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలి

సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే..నోటీసులు ఇవ్వడం జరిగిందని, తమ నోటీసులకు రిప్లై రాకపోతే..న్యాయపరంగా ముందుకెళుతామని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Allu Arjun Rapido Ad: సినీ నటుడు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే..కఠినంగా వ్యవహరిస్తామని, వెంటనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలన్నారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా…వ్యవహరించకూడదన్నారు.

Read More : Midwifery in Govt Hospitals : నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు వ్యాయామం

అసలు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కారణం ఉంది. బైక్ ట్యాక్సీ రంగంలో ర్యాపిడో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సినీ నటుడు అల్లు అర్జున్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రచారం నిర్వహించారు. ర్యాపిడో అందిస్తున్న ఆఫర్లు, యానిక్ ఫీచర్లను వివరించడం ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓ యాడ్ టీవీ ఛానల్స్ లో ప్రసారమౌతోంది. ర్యాపిడో సంస్థను ప్రమోట్ చేస్తూ..అల్లు అర్జున్ యాడ్ లో నటించాడు. ఇందులో బన్నీ..దోశ చేస్తూ..ఓ ప్రయాణీకుడికి… Rapido Bike app గురించి చెబుతుంటాడు. వీడియోలో ఆర్టీసీ బస్సును చూపించారు. బస్సులో జనాలు ఇరుకుగా ఎక్కుతుంటారు. ర్యాపిడో బుక్ చేసుకోండి..దోశ తీసినంత సులభంగా…వెళ్లిపోండి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు.

Read More : China : 22 అంతస్తుల భవనంపై చిన్నారులు..ఒళ్లు జలదరించే వీడియో

అల్లు అర్జున్‌తో పాటు Rapido సంస్థకి ఆర్టీసీ సంస్థ నోటిసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే..నోటీసులు ఇవ్వడం జరిగిందని వివరణనిచ్చారు. తమ నోటీసులకు రిప్లై రాకపోతే..న్యాయపరంగా ముందుకెళుతామని, తక్షణమే బన్నీ, ర్యాపిడో సంస్థలు ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు. సెప్టెంబర్లో హెచ్.సి.యూ డిపో నుంచి బస్సు ను అద్దెకు తీసుకున్నారని, సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారాయన. తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని, ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్ట పెంచుతామని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ట్రెండింగ్ వార్తలు