Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ (Amazon Great Republic Day Sale Date)ని ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ యూజర్ల (Amazon Prime Users) కోసం జనవరి 16న సేల్ ప్రారంభమవుతుంది. అయితే మిగతా వారందరికీ జనవరి 17న డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. ఈ సేల్ జనవరి 20 వరకు కొనసాగుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది.
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Amazon Apple, OnePlus, Redmi, Poco, Samsung సహా అనేక ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. SBI కార్డ్ ద్వారా చేసే EMI లావాదేవీలపై కూడా ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ కచ్చితమైన డీల్స్ వెల్లడించనప్పటికీ.. ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సహా ఆపిల్ ఐఫోన్లు సేల్ సమయంలో డిస్కౌంట్‌తో వచ్చిందని సూచించింది. Amazon OnePlus, Redmi, Samsung, Xiaomi, అనేక ఇతర బ్రాండ్ల నుంచి ఫోన్లపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. నిర్దిష్ట డిస్కౌంట్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో OnePlus 10T, Samsung Galaxy S20 FE, iQOO Neo 6, Redmi Note 11 మరికొన్ని భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.స్మార్ట్ఫోన్లతో పాటు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై కూడా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు లేదా ఫిట్నెస్ బ్యాండ్ కేటగిరీని అందించనున్నట్లు వెల్లడించింది. అదనంగా, హెడ్ఫోన్లు, నెక్‌బ్యాండ్‌లపై కూడా 75 శాతం తగ్గింపు ఉంటుందని అంచనా. అలాగే స్పీకర్ల ధర 65 శాతం తగ్గుతుంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లతో సహా పెద్ద అప్లియన్సెస్‌పై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
అమెజాన్ అందించే ఫ్లాట్ డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Amazon ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, కొన్ని డివైజ్‌లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తుంది. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ జనవరి 15 నుంచి జనవరి 20 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సేల్ సమయంలో, Samsung, Apple, Google అనేక ఇతర బ్రాండ్ల నుంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు భారీ ధర తగ్గుదలని చూస్తాయని ప్లాట్‌ఫాం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లలో కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..