Exact Score RCB Need To Beat CSK In Top 4 Race
Royal Challengers Bangalore : ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మినహా మరే జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. హ్యాట్రిక్ ఓటములతో రాజస్థాన్ రాయల్స్ డీలా పడింది. అయినప్పటికి ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లు పోటీ పడుతున్నాయి.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ సీజన్‌లో ఫస్టాప్‌లో ఏడు మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఆ తరువాత ఆరు మ్యాచులు ఆడగా వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. మొత్తంగా 13 మ్యాచులు ఆడిన బెంగళూరు ఆరు విజయాలు సాధించింది. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. +0.387 నెట్ రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
లీగులో తన చివరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మొదట ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో లేదంటే లక్ష్య ఛేదన అయితే 18.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే సీఎస్‌కే కంటే ఆర్‌సీబీ రన్‌రేటు మెరుగుఅవుతుంది. రెండు జట్ల పాయింట్లు సమానం అయినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.
అయితే.. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై చేతిలో ఆర్‌సీబీ ఓడిపోతే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండానే ఇంటి బాట పట్టనుంది.
సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే..
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచులు ఆడింది. ఏడు మ్యాచుల్లో గెలవడంలో ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. +0.528 నెట్ రన్‌రేటును కలిగి ఉంది. తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరడంతో ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది.
Virat Kohli : సింహంతో పరాచకాలా..! మనకెందుకు ఇషాంత్..! చూడు ఇప్పుడు ఏమైందో..?
ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధించినా, ఆర్‌సీబీ మెరుగైన రన్‌రేటుతో గెలిస్తే మాత్రం సీఎస్‌కు ఇంటి బాట పట్టక తప్పదు.