Amazon Echo Show 10 : అమెజాన్‌ Echo Show స్మార్ట్ డివైజ్‌లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎట్టకేలకు రెండు కొత్త స్మార్ట్ డివైజ్ లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ డిస్ ప్లే, స్పీకర్ డివైజ్‌లు అమెజాన్ ఇండియా మార్కెట్లో అత్యంత ఖరీదైనవి. అవే.. కొత్త Echo Show 10, Echo Show 5 మోస్ట్ అడ్వాన్సడ్ డివైజ్‌లు.

Amazon Echo Show 10 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎట్టకేలకు రెండు కొత్త స్మార్ట్ డివైజ్ లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ డిస్ ప్లే, స్పీకర్ డివైజ్‌లు అమెజాన్ ఇండియాలో అత్యంత ఖరీదైనవి. అవే.. కొత్త Echo Show 10, Echo Show 5 మోస్ట్ అడ్వాన్సడ్ డివైజ్‌లు. ఈ డివైజ్ ల్లో 10.1 అంగుళాల HD Display (1280×800-ఫిక్సల్స్) రెజుల్యుషన్, 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు, ప్రీమియం సౌండ్ కలిగి ఉన్నాయి. ఇంటెలిజెంట్ మోషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దాంతో ఎటువైపు అంటే యూజర్ ఫేస్ కు తగినట్టుగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఎకో డివైజ్ లు అద్భుతమైన కొత్త ఫీచర్లతో వచ్చాయి.

HD డిస్‌ప్లేతో పాటు ఆడియో వినసొంపుగా ఉంటుందని అమెజాన్ డివైజెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా అన్నారు. అలెక్సా ద్వారా ఎకో షో డివైజ్ లకు కనెక్ట్ చేసినప్పుడు వాయిస్, డిస్ ప్లేతో పాటు టచ్ మూవెంట్ కూడా బాగుందంటూ భారత యూజర్ల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పారు. కొత్త అమెజాన్ Echo Show 10 డివైజ్ భారత మార్కెట్లో ధర రూ.24,999లకు లాంచ్ అయింది. అమెరికాలో కంటే ఇండియాలోనే దీని ధర ఎక్కువ. అక్కడ 250 డాలర్లు (రూ.18,600)కే సొంతం చేసుకోవచ్చు. ఇక Echo Show 10 డివైజ్ సింగిల్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

మరో అమెజాన్ Echo Show 5 డివైజ్ ధర రూ.8,999లకు లభ్యం అవుతోంది. దీని ధర అమెజాన్ లో రూ.6,999ల డిస్కౌంట్ తో లభ్యమవుతోంది. ఈ స్మార్ట్ డివైజ్ మూడు కలర్లు బ్లాక్, వైట్, బ్లూ వేరియంట్లలో అందుబాటులో ఉంది. Amazon India వెబ్ సైట్లో ఈ స్మార్ట్ డివైజ్ లను యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్ ఇకో షో స్మార్ట్ డిస్ ప్లేతో పాటు ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ స్పీకర్ కూడా వస్తోంది. యూజర్లు Amazon Prime Music, Spotify, JioSaavn, Gaana, and Apple Music నుంచి సాంగ్స్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు. Echo Show 5 స్మార్ట్ డివైజ్ లో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 5.5 అంగుళాల డిస్ ప్లే, HD కెమెరా అప్ గ్రేడ్ అయి వచ్చింది. దాంతో యూజర్లు ఈజీగా వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు