Baby Movie : బేబీ మూవీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. నాలుగు గంటల సినిమా ఓటీటీలో..?

బేబీ మూవీ రన్ టైం చాలా ఎక్కువ అవ్వడం వల్ల.. సినిమాలోని చాలా సన్నివేశాలు కట్ చేసేశారు. అయితే ఓటీటీలో మాత్రం..

Anand Deverakonda Vaishnavi Chaitanya Baby Movie full version released in ott

Baby Movie : SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 14న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకి భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుత జనరేషన్ లో జరుగుతున్న ప్రేమకథలను ఇతివృత్తంగా తీసుకోని తెరకెక్కించిన ఈ మూవీ యూత్ లోని ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది.

Rangabali : ఓటీటీలోకి వచ్చేసిన నాగశౌర్య రంగబలి.. ఎందులోనో తెలుసా?

ఇక ఈ మూవీలో నటించిన ఆనంద్ అండ్ వైష్ణవి కూడా తమ పాత్రల్లో జీవించేసి.. ఆడియన్స్ కి తమనే స్క్రీన్ పై చూసుకుంటున్న ఫీలింగ్ ని కలిపించారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ మూవీకి ఫిదా అయ్యిపోతున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్, పూరీజగన్నాధ్.. ఇలా ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈమద్యలో పెద్ద సినిమాలు వచ్చినా గాని ఇప్పటికి థియేటర్స్ లో బేబీ ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ చిత్రం ఇప్పటివరకు 75 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

Tamannaah : సుశాంత్ ఫస్ట్ సినిమాలో హీరోయిన్.. ఇప్పుడేమో సుశాంత్‌కి సిస్టర్ గా..

అయితే ఈ సినిమాని ఇప్పటికే థియేటర్స్ పలుమార్లు చూసిన ఆడియన్స్.. ఓటీటీకి బేబీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అదికూడా ఎక్సట్రా ప్యాకేజీతో రాబోతుంది. మూవీ రన్ టైం చాలా ఎక్కువ అవ్వడం వల్ల.. సినిమాలోని చాలా సన్నివేశాలు కట్ చేసేశారు. హీరో – అమ్మ, హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్, హీరోయిన్ – బాయ్ ఫ్రెండ్ బోల్డ్ సీన్స్.. ఇలా మరికొన్ని సీన్స్ తో మొత్తం నాలుగు గంటల రన్ టైంతో బేబీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. మరి ఆ కంప్లీట్ ఎమోషన్ రోలర్ కోస్టర్ ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

 

 

ట్రెండింగ్ వార్తలు