Asia Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత‌.. ముందు ఆసియా క‌ప్‌ను కొట్టండి.. ప్రొమో అదిరిపోయింది

ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌క‌న్నా ముందు ఆసియా క‌ప్ ను ఆగ‌స్ట్ 31 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

Asia Cup 2023

Asia Cup : ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌క‌న్నా ముందు ఆసియా క‌ప్ ను ఆగ‌స్ట్ 31 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఆరు దేశాలు ఇందులో పాల్గొన‌నుండ‌గా, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు అతిథ్యం ఇవ్వ‌నున్నాయి. హైబ్రిడ్ మోడ‌ల్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిచేందుకు ఏసీసీ(Asian Cricket Council) నిర్ణ‌యం తీసుకోగా పాక్‌లో నాలుగు, శ్రీలంక‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. ఈ టోర్నీ ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్‌స్పోర్ట్స్ ద‌క్కించుకుంది.

ఈ క్ర‌మంలో ఓ వీడియో ప్రొమోను స్టార్‌స్పోర్ట్స్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భార‌త జ‌ట్టు ప్ర‌యాణంతో పాటు టోర్నీ గురించి వీడియోలో తెలిపింది. అంతేకాదు టీమ్ఇండియాను ఉత్సాహ‌ప‌రిచింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కంటే ముందు జ‌ర‌గ‌నున్న ఆసియా క‌ప్ ను సాధించాలంటూ టీమ్ఇండియాను ప్రోత్స‌హించింది. ఆఖ‌ర్లో భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలంటూ అభిమానుల‌కు సూచిస్తూ వీడియోను ముగించింది.

BAN vs AFG : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యం

ఆసియా క‌ప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లతో క‌లిపి మొత్తం ఆరు జ‌ట్లు బ‌రిలోకి దిగ‌నున్నాయి. మూడు జ‌ట్ల‌ను రెండేసి గ్రూపులు విభ‌జించారు. భారత్, పాకిస్తాన్, నేపాల్ లు ఒక గ్రూప్‌లో ఉండ‌గా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మ‌రో గ్రూపులో ఉన్నాయి. గ్రూపు ద‌శ‌లో సాధించిన విజ‌యాల ఆధారంగా ప్ర‌తి గ్రూపు నుంచి రెండు జ‌ట్లు సూప‌ర్ ఫోర్‌కు అర్హ‌త సాధించ‌నున్నాయి. సూప‌ర్-4 ద‌శ‌లో టాప్‌-2గా నిలిచిన జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

India tour of West Indies : టెస్టు సిరీస్‌కు రోహిత్, కోహ్లితో పాటు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి..? కెప్టెన్‌గా అజింక్య ర‌హానె..?

ఈ సంవ‌త్స‌రం వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఉన్న నేప‌థ్యంలో ఆసియా క‌ప్‌ను వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించారు. గ‌త‌సారి టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించిన ఆసియా క‌ప్‌లో ఫైన‌ల్‌లో పాక్‌ను ఓడించి శ్రీలంక విజేత‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు