Atrangi Re: బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, స్టార్ కిడ్ సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అత్రంగి రే’.. ‘తను వెడ్స్ మను’, ‘రాంజానా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నారు.
Prabhas : మన తెలుగోడురా భయ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్..
‘రాంజానా’ తర్వాత ధనుష్ యాక్ట్ చేస్తున్న హిందీ సినిమా ఇది. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుడ్ కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సారాకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలని తమిళనాడు నుంచి ధనుష్‌ని కిడ్నాప్ చేసి తీసుకురావడం.. ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చెయ్యడం.. కొద్దిరోజులకి ధనుష్‌కి తనంటే ఇష్టం లేదని గ్రహించిన సారా ఇంతకుముందు తానో వ్యక్తిని ప్రేమించానని చెప్తోంది.
Pushpa Movie : సుకుమార్ కోసం మేకప్‌మెన్‌గా మారిన అల్లు అర్జున్!
అతనే అక్షయ్ కుమార్.. ‘అత్రంగి రే’ లో అక్షయ్ మెజీషియన్ క్యారెక్టర్లో కనిపించి ఆకట్టుకున్నారు. అక్షయ్‌ను కలసినా సరే సారా ధనుష్‌ను ఇష్టపడుతుంటుంది. ధనుష్ కూడా ఆమెను ప్రేమిస్తుంటాడు. వీళ్ల ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది అసలు కథ..
Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..
నటీనటుల పర్ఫార్మెన్స్, కాన్సెప్ట్, డైలాగ్స్.. విజువల్స్, ఆర్ఆర్, సాంగ్స్ అన్నీ కూడా ట్రైలర్లో పర్ఫెక్ట్గా కుదిరాయి. సినిమా మీద అంచనాలు పెంచేసింది ట్రైలర్.. డిసెంబర్ 24 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘అత్రంగి రే’ స్ట్రీమింగ్ కానుంది.