Patancheru Mokila : ఒక్క గజం ధర లక్ష రూపాయలు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన మోకిలా ప్లాట్లు

ప్రభుత్వం ఆశించిన దాని కంటే రెండు రెట్లు అధికంగా ఆదాయం వచ్చింది.Patancheru Mokila Lands

Patancheru Mokila Lands

Patancheru Mokila Lands : పటాన్ చెరు మోకిలా వద్ద హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం ముగిసింది. ఇక్కడ కూడా హెచ్ఎండీఏ భూములు భారీ ధర పలికాయి. మోకిలా ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 165 ఎకరాల్లో లేఔట్ ప్లాన్ చేశారు. 1,321 లాట్లకు గాను మొదటి పేజ్ లో 50 ప్లాట్లను వేలం వేశారు. అత్యధికంగా గజం భూమి ధర రూ.1.05 లక్షలు పలికింది. ఇక్కడ మొత్తం 15వేల 800 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టింది హెచ్ఎండీఏ. మొత్తం 50 ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది.

ఈ లేఔట్ మొత్తం రెసిడెన్షియల్ యూస్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. 300, 500 గజాల ప్లాట్లను అమ్మకానికి పెట్టింది హెచ్ఎండీఏ. గజానికి 25 వేల రూపాయలను అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఉదయం 25 ప్లాట్లను వేలానికి పెట్టగా మధ్యాహ్నం సెషన్ లో మరో 25 ఫ్లాట్ లను అమ్మకానికి పెట్టింది. ఒక గజానికి మినిమం 500 రూపాయలు పెంచాల్సి ఉంటుంది.

Also Read..Electricity Bill Kills : దారుణం.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని మీటర్ రీడింగ్ ఉద్యోగి దారుణ హత్య

500 గజాలు ఉన్న ఒక ప్లాట్ లో అత్యధికంగా గజం ధర లక్ష 5 వేల రూపాయల పలకగా.. అత్యల్పంగా 300 గజాలు ఉన్న ప్లాట్ లో ఒక గజం ధర 72వేలు పలికింది. సరాసరిగా ఒక్కో గజం భూమి ధర 80వేల 397 రూపాయలు పలికింది. ప్రభుత్వం ఆశించిన దాని కంటే రెండు రెట్లు అధికంగా ఆదాయం వచ్చింది. మోకిలా వద్ద హెచ్ఎండీఏ లేఔట్ లో రెండవ ఫేజ్ కు త్వరలో వేలం వేయనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది.

ఇటీవల కోకాపేట నియోపోలిస్ లేఔట్ లో భూముల వేలం వేయంగా.. రికార్డు స్థాయిలో ధర పలికిన సంగతి తెలిసిందే. అక్కడ ఎకరం భూమి ఏకంగా రూ.100 కోట్లకుపైగా పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో దశ భూముల వేలంలో.. పదో ప్లాట్‌లో ఉన్న 3.6 ఎకరాల భూమిని హ్యాపీరైట్స్ నియోపోలిస్, రాజ్‌పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకంగా రూ.362 కోట్లకు కొనుగోలు చేశాయి. మన దేశ రియల్ ఎస్టేట్ చరిత్రలో.. ప్రభుత్వ భూమి ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.

Also Read..Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు