Baby 9 Days Collections : కలెక్షన్లలో ‘బేబీ’ జోరు.. 9 రోజుల్లోనే ఇన్ని కోట్లా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘బేబీ’. చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Baby Collections

Baby Collections : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘బేబీ’. చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. సాయి రాజేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది.

Jawan : వామ్మో.. ‘జవాన్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5oo కోట్లపైనే.. రిలీజ్ అవ్వకుండానే లాభాల్లో..

ఇప్పటికి థియేటర్స్ ల‌లో హౌస్ ఫుల్ గా ఉంది అంటే సినిమా ఏ మేర జ‌నాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం 60.3 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో(సుమారు రూ.8కోట్ల) రూపుదిద్దుకున్న ఈ సినిమా మొద‌టి మూడు రోజుల్లో లాభాల బాట ప‌ట్టింది. చిన్న చిత్రాల్లో త‌క్కువ రోజుల్లో ఈ రేంజ్ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. బేబీ సినిమా తొమ్మిది రోజుల వ‌సూళ్ల‌ను చిత్ర ద‌ర్శ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు.

Brahmaji : స్టార్ డైరెక్ట‌ర్‌ని క‌త్తితో బెదిరించిన న‌టుడు బ్ర‌హ్మాజీ.. వీడియో వైర‌ల్‌.. కొడుకు సినిమా కోస‌మే..!

వైష్ణ‌వి చైత‌న్య న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. శ్రీనివాస కుమార్ (ఎస్‍కేఎన్) ఈ సినిమాని నిర్మించ‌గా బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి పెద్ద‌గా పోటీ కూడా లేదు. బ్రో సినిమా రిలీజ్ (జూలై 28) అయ్యేంత వ‌ర‌కు ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల‌కు ఎటువంటి డోకా ఉండ‌ద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు