Jawan : వామ్మో.. ‘జవాన్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5oo కోట్లపైనే.. రిలీజ్ అవ్వకుండానే లాభాల్లో..

జవాన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులపైనే సమయం ఉంది. తాజాగా జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం సేల్ అయిపోయింది.

Shahrukh Khan Jawan Pre Release Business full Details

Jawan Pre Release Business :  షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా తమిళ దర్శకుడు అట్లీ(Atlee) దర్శకత్వంలో రాబోతున్న భారీ సినిమా జవాన్. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటిస్తున్నారు. ప్రియమణి, దీపికా పదుకొనే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. జవాన్ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు.

ఇటీవల జవాన్ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇందులో షారుఖ్ పోరాటాలు, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని మెప్పించాయి. ఇక చివర్లో షారుఖ్ గుండుతో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో జవాన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులపైనే సమయం ఉంది. తాజాగా జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం సేల్ అయిపోయింది.

నాన్ థియేట్రికల్ :

శాటిలైట్ – 84 కోట్లు
డిజిటల్ – 130 కోట్లు
మ్యూజిక్ – 36 కోట్లు

ఇలా జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ మొత్తం 250 కోట్లకు అమ్ముడుపోయింది.

థియేట్రికల్

ఓవర్సీస్ – 105 కోట్లు
తమిళనాడు – 17 కోట్లు
ఏపీ, తెలంగాణ – 15 కోట్లు
కర్ణాటక – 15 కోట్లు
కేరళ – 7 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 155 కోట్లు

జవాన్ సినిమా మొత్తం థియేట్రికల్ హక్కులు 314 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో మొత్తం జవాన్ సినిమా 564 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బడ్జెట్ 250 కోట్లు. దీంతో ఇప్పటికే జవాన్ చిత్ర యూనిట్ ఏకంగా 300 కోట్ల ప్రాఫిట్స్ తెచ్చేసుకుంది. మరి సినిమా రిలీజయ్యాక థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 320 కోట్ల షేర్ కలెక్షన్స్ అంటే దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేయాలి.

Nithin 32 : ఒకేసారి నితిన్ 32వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ అనౌన్స్..

ప్రస్తుతం షారుఖ్ ఉన్న జోరు చూస్తుంటే ఈ కలెక్షన్స్ వచ్చేలానే కనిపిస్తున్నాయి. పఠాన్ సినిమాతో 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టాడు షారుఖ్. జవాన్ డైరెక్టర్ అట్లీ కావడంతో ఈ సినిమాపై సౌత్ లో కూడా అంచనాలు ఉన్నాయి. దీంతో జవాన్ సినిమా కూడా ఈజీగా 700 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు