Balagam : మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం.. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం.. ప్రియదర్శి స్పెషల్ పోస్ట్..

చిన్న సినిమాగా రిలీజయిన బలగం భారీ విజయం సాధించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు వేడెక్కల్లో ఓ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం సినిమా తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.

Balagam :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రత్యేక అభినందనలు వచ్చాయి. తెలంగాణ(Telangana) స్లాంగ్ లో, తెలంగాణ ఊరిలో జరిగే కథగా ఈ సినిమా రావడంతో తెలంగాణ ప్రముఖులు అంతా ఈ సినిమాని అభినందిస్తున్నారు.

చిన్న సినిమాగా రిలీజయిన బలగం భారీ విజయం సాధించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు వేడెక్కల్లో ఓ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం సినిమా తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. యుక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా ‘బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం’ అవార్డు గెలుచుకుంది. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

Allu Arha : అర్హ కోసం సెట్‌లో అందరూ తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది..

ఈ అవార్డు సాధించిన నేపథ్యంలో బలగం సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన ప్రియదర్శి ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసి.. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం. బలగం సినిమా యుక్రెయిన్ ఒనికో ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం అవార్డు అందుకుంది. ఇది సాధ్యం చేసినందనుకు మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపాడు. ఇక దర్శకుడు వేణు దీని గురించి పోస్ట్ చేస్తూ హద్దులు దాటుకుంటూ బలగం సినిమా అందర్నీ మెప్పిస్తూ అవార్డులు గెలుచుకుంటుంది అని పోస్ట్ చేశాడు. బలగం చిత్రయూనిట్ మరిన్ని అంతర్జాతీయ అవార్డులకు ఈ సినిమాను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా బాగుండి, విజయం సాధించి.. ఇప్పుడు ఇలా అవార్డులు గెలుస్తుండటంతో అంతా దర్శకుడు వేణు, బలగం చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు